Moviesఇండస్ట్రీలో మరో పెళ్ళి భాజా.. పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్...

ఇండస్ట్రీలో మరో పెళ్ళి భాజా.. పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరో-హీరోయిన్..!?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్ధార్ధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ మధ్య కాలంలో సిద్ధు హిట్ట్ కొట్టిందే లేదు. కాగా ఆయన ఎంతో ఇష్టంగా తీసుకుని నటించిన “టక్కరి” సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది . ఈ క్రమంలోనే సిద్ధార్ధ్ ఆ బాధ నుంచి కోల్పోవడానికి ..పలుషో ల కి అటెండ్ అవుతూ చిలౌట్ అవుతూ.. సినిమా కోసం ఎంత కష్ట పడ్డారో చెప్పుకొస్తున్నారు.

తాజాగా సిద్ధార్ధ్ ” స్టార్ మా” లో ప్రసారమవుతున్న డాన్స్ షోకి అతిథిగా హాజరయ్యారు . ఈ క్రమంలోనే హోస్టుగా చేస్తున్న శ్రీముఖి.. సిద్ధార్థ్ ను ఓపెన్ గా ప్రశ్న అడిగారు. మీరు జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటూ ప్రశ్నించింది . దీంతో సిద్ధార్ధ్ సైతం స్మైలీ గా మాట్లాడుతూ ” మా ఊళ్లో అతిథిదేవోభవ అంటారు ” అంటూ సిద్ధార్ధ్ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో “అతిథిదేవోభవ” లో ‘అతిధి” ఉంది. ఈ రేంజ్ లో హింట్ ఇచ్చాడు సిద్ధార్ధ్..అంటూ వీళ్ళ ఎఫైర్ మరోసారి వైరల్ గా మారింది.

అంటే సిద్ధార్ధ్ – అతిధిరావు హైదరి డేటింగ్ లో ఉన్నట్టేగా ..ఆయన ఆమెను జీవితాంతం లైఫ్ పార్ట్నర్ గా.. డాన్స్ పార్టనర్ గా ఊహించుకుంటున్నట్లుగా అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మొగాల్సిందే అంటున్నారు జనాలు . చూద్దాం మరి సిద్ధార్ధ్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో.?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news