Movies"దేవర" సినిమాలో మరో పాన్ ఇండియా బ్యూటీ..ఎన్టీఆర్ కోసం కొరటాల అన్నంత...

“దేవర” సినిమాలో మరో పాన్ ఇండియా బ్యూటీ..ఎన్టీఆర్ కోసం కొరటాల అన్నంత పని చేసేసాడుగా..!!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలలో “దేవర ” సినిమా కూడా ఒకటి . టాలీవుడ్ యంగ్ టైగర్ హీరోగా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ … ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి అభిమానులు . అంతేకాదు పాన్ ఇండియా లెవల్ లో తరికెక్కి రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో మరోసారి ఎన్టీఆర్ పై ఆస్కార్ స్థాయి ఆశలు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు నందమూరి అభిమానులు .

ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . సెకండ్ హీరోయిన్ రష్మిక మందన లేదా మృణాల్ ఠాకూర్ అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమాలో మరో కత్తిలాంటి ఫిగర్ ని సెట్ చేశాడు కొరటాల శివ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత . ప్రెసెంట్ ఆమె ఎలాంటి సినిమాలతో ముందుకు వెళ్తుందో మనకు తెలిసిందే.

ఇలాంటి క్రమంలోనే సినిమాకి మరింత హైప్ రావడానికి సమంతతో ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయించాలని కొరటాల శివ ప్లాన్ చేశారట . ఆశ్చర్యమేంటంటే ఎన్టీఆర్ సినిమా అనగానే సమంత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది అంటూ తెలుస్తుంది . ఈ పాటలో ధూం ధాం స్టెప్పులు వేయడానికి సిద్ధమవుతున్నారు తారక్-సమంత. దీంతో మరోసారి ఐటెం సాంగ్ చేయబోతుంది సమంత అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news