Movies"ఆయనకు తెలియకుండానే అదంతా జరిగిందా..?".. మరోసారి విజయ్ దేవరకొండను కెలికిన అనసూయ..!!

“ఆయనకు తెలియకుండానే అదంతా జరిగిందా..?”.. మరోసారి విజయ్ దేవరకొండను కెలికిన అనసూయ..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి హ్యూజ్ ట్రోలింగ్ కి గురైందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి ట్విట్ చేసినప్పటి నుంచి ఆమెను ఆంటీ ఆంటీ అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు దీనిపై ఏ విధంగా స్పందించిన అనసూయ రీసెంట్గా ఓ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఓపెన్గా కామెంట్ చేసింది. ఈ క్రమంలోని అనసూయ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

అనసూయ మాట్లాడుతూ..” నేను విజయ్ మంచి ఫ్రెండ్సే ..మా మధ్య ఎప్పుడు ఏ సమస్య లేదు ..అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాతే మా పరిస్థితి మారిపోయింది.. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే.. సినిమాలో పదాలు వచ్చేటప్పుడు మ్యూట్ చేశారు.. అయితే విజయ్ థియేటర్ కి వచ్చినప్పుడు ఆ పదాలను స్క్రీన్ పై వేస్తూ ..వాటిని పలకాలని విజయ్ ఆడియన్స్ కోరారు ..అదే నాకు నచ్చలేదు ..సినిమా వరకు ఓకే కానీ ..నిజ జీవితంలో ప్రేక్షకుల పదాలను పలకడం ప్రోత్సహించడం..? ఏంటి ఓ తల్లిగా ఇలాంటి అసభ్యకరమైన పదాలు నన్ను బాధిస్తాయి ..అందుకే నేను మాట్లాడాను . విజయ్తో మాట్లాడి ఇలాంటి పనులు చేయొద్దు అంటూ చెప్పుకొచ్చాను..” అంటూ అనసూయ క్లారిటీ ఇచ్చింది.

అంతేకాదు అనసూయ ఇంకా మాట్లాడుతూ ..”2019లో మీకు మాత్రమే చెప్తా అనే సినిమాకి విజయ్ నాకు ఆఫర్ ఇచ్చారు. అయితే విజయ్ ప్రచారకర్త తనను దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్టు అతడి బృందానికి చెందిన ఒకరు నాకు పర్సనల్ గా మ్యాటర్ ని లీక్ చేశారు. ప్రచారకర్త ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు దానిపై విజయ్ దేవరకొండకు ఆ మాత్రం అవగాహన ఉండదా ..?ఉంటుంది ..కదా ..అతనికి తెలియకుండానే అతని కాంపౌండ్ లో ఇన్ని జరుగుతున్నాయా..? నేను కచ్చితంగా చెప్పగలను ఆయనకు తెలియకుండా ఇలాంటివి ఎవ్వరూ చేయరు ..”అని అనసూయ విజయ్ దేవరకొండ పై మరోసారి ఫైర్ అయ్యింది. దీంతో అనసూయ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news