Newsప్రభాస్ - అనుష్క సీన్ ను భలే రిపీట్ చేశారుగా.. మామిడితోటలో...

ప్రభాస్ – అనుష్క సీన్ ను భలే రిపీట్ చేశారుగా.. మామిడితోటలో భర్త తో తెగ ఎంజాయ్ చేస్తున్న అనసూయ..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బడా బడా స్టార్ హీరోయిన్స్ ని కూడా పట్టించుకోని జనాలు అనసూయ చిన్న తప్పు చేస్తే పట్టేసుకుని సోషల్ మీడియాలో ఏకీపారిస్తున్నారు . అంతలా స్టార్ హీరోయిన్స్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది అనసూయ.

రీసెంట్గా భర్తతో పిల్లలతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏ విధంగా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుందో సోషల్ మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేసి అభిమానులకి తెలియజేస్తుంది. రీసెంట్గా అలాంటి కొన్ని ఫొటోస్ ని షేర్ చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది అనసూయ . ఆమె రీసెంట్గా మామిడి తోటలో భర్తతో తెగ ఎంజాయ్ చేసింది . దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ తోటలో సేమ్ మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్ ని ఎత్తుకున్నట్లు.. ఒక సీన్ ను రిపీట్ చేశారు అనసూయ – భరద్వాజ్ . కాగా అక్కడ ప్రభాస్ ని అనుష్క ఎత్తుకుంటే ..ఈ సీన్ కి వచ్చేసరికి భరద్వాజ్ అనసూయని ఎత్తుకున్నాడు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మరికొందరు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news