Moviesఅక్కినినేని నాగచైతన్య తో పెళ్లి.. క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన శోభిత...

అక్కినినేని నాగచైతన్య తో పెళ్లి.. క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన శోభిత ధూళిపాళ్ల..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక గాసిప్ లు అనేవి చాలా ఎక్కువగా మారిపోయాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ శోభిత దూళిపాలపై ఏ విధమైన ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్యతో ప్రేమాయణం నడుపుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ నానా రకాల వార్తలు వైరల్ అయ్యాయి . కాగా ఇలాంటి క్రమంలోనే ఆమె హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేయడం నాగచైతన్య ఉన్న ఫొటోస్ వైరల్ అవడం మరింత హీట్ పుట్టించేసింది.

వీటన్నిటికీ చెక్ పెడుతూ శోభిత దూళిపాల సంచలన కామెంట్స్ చేసింది . ఆమె నటిస్తున్న “ది నైట్ మేనేజర్2″ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న శోభిత దూళిపాల తన కాబోయే వాడి గురించి క్లారిటీ ఇచ్చింది . ఆమె మాట్లాడుతూ..” నాకు కాబోయే వాడు చాలా సింపుల్ గా ఉండాలి. మంచి మనసు దయ కలిగి ఉండాలి. జీవితం చాలా చిన్నది ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలి ..ఆస్వాదించాలి. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి అలాంటి వాడిని నా భర్తగా కోరుకుంటాను “అన్నారు .

దీంతో సోషల్ మీడియాలో మరోసారి నాగచైతన్య శోభిత దూళిపాల పెళ్లి మ్యాటర్ వైరల్ గా మారింది. ఎందుకంటే నాగచైతన్యకు ఎంత డబ్బున్న సరే చాలా సింపుల్ గా ఉంటాడు . ఇక దయ విషయంలో చెప్పనవసరమే లేదు ..తన చేసిన హెల్ప్ ని బయటికి చెప్పకుండా ఉంటాడు . నాగచైతన్య కూడా జీవితం చాలా చిన్నది ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు . ఈ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ చాలా మ్యాచ్ అయిపోయినట్లే ..త్వరలోనే పెళ్లి గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news