వ్యాంపు పాత్రలు సహా.. ఐటం సాంగుల్లో తళుక్కున మెరిసిన డిస్కో శాంతి జీవితం.. అనూహ్యమైన మలు పు గురించి అందరికీ తెలిసిందే. విలన్గా నటించిన శ్రీహరిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయి తే.. ఈ పెళ్లి సాదాసీదాగా జరిగింది కాదు. ఎంతో మంది చేతులు వేసి కలిపిన బంధమని ఆమే చెప్పుకొచ్చా రు ఓ సందర్భంలో. అసలు డిస్కో శాంతి అంటే.. వ్యాంపు పాత్రలకు మాత్రమే పరిమితమైన నటి.
నిజానికి చెన్నైలో బిజీగా ఉన్న సమయంలో చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాలో ఫేమస్ అయ్యా రు. ఇలా.. తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా.. తెలుగు సినిమా రంగంలో దూసుకుపోయారు. అయితే.. ఏ సినిమాలో అయినా కేవలం ఒక పాటకే పరిమితం అయ్యారు. ఇలా.. నటిస్తున్న సమయంలో షూటింగ్ స్పాట్లో శ్రీహరితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ఒకసారి చెన్నై వెళ్లినప్పుడు.. తనను ఒంటరిగా కలిసిన శ్రీహరికి తాను ప్రపోజ్ చేశానని చెప్పిన డిస్కో శాంతి.. ఆయనతో డేటింగ్ చేసింది. అయితే.. తర్వాత.. శ్రీహరి డిస్కోశాంతిని వదిలించుకునే ప్రయత్నం చేశాడని ఒక టాక్ నడిచింది. దీనిపై తమిళ మ్యాగజైన్లలో అప్పట్లో తీవ్ర విమర్శలు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన రామానాయుడు అప్పాయింట్మెంట్ తీసుకుని.. డిస్కో శాంతి ఈ విషయాన్ని ఆయనకు వివరించింది.
దీంతో రామానాయుడు జోక్యం చేసుకుని.. కొన్ని షరతులతో వీరి వివాహం జరిపించారని అంటారు. ఇదే విషయాన్ని శాంతి కూడా చెప్పారు. ఇక, శాంతి అసలు పేరు శాంత కుమారి. తెలుగు, తమిళ, కన్నడ సహా మొత్త 9 భాషల సినిమాల్లో ఆమె వ్యాంపు పాత్రల్లోనే నటించారు. మొత్తం 900 సినిమాలు నటించిన ఆమె వివాహం తర్వాత.. సినిమా రంగానికి దూరమయ్యారు. శ్రీహరి అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. శ్రీహరి కుమారుడు కూడా సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.