అక్కినేని నాగచైతన్య, సమంత టాలీవుడ్లో ఎంత క్యూట్ కఫుల్సో చెప్పక్కర్లేదు. అసలు వారిద్దరు ప్రేమించుకుంటున్నారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే టాలీవుడ్ మొత్తం సంతోషపడింది. వారిద్దరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కాపురం చేస్తున్నంత సేపు మీడియా ఎట్రాక్షన్ అంతా సామ్ – చై మీదే ఉండేది. అసలు వారిద్దరు ఎక్కడ కనపడినా ఆ ఫోటోలకు ఉండే క్రేజే వేరు.
వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఎంతో క్రేజ్ ఉండేది. వీరి కాంబోలో ఏమాయ చేశావే – మనం – ఆటోనగర్ సూర్య – మజిలీ – రిక్సోనా యాడ్ – అలాగే సమంత చేసిన ఓ బేబీలో చైతు చేసిన రోల్ ఇలా వీరి కాంబినేషన్ అంటేనే మాంచి రొమాంటిక్ కాంబినేషన్ అన్న పేరు ఉండేది. పెళ్లయ్యాక కూడా ఈ జంట మజిలీ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది.
మజిలీ సినిమా రిలీజ్ అయిన నాలుగు నెలలకే వీరిద్దరు విడిపోయారు. వీరు విడిపోవడానికి నాలుగు నెలల ముందు వరకు కూడా ఎంతో ఎంజాయ్ చేసేశారు. ట్రిప్‌ల మీద ట్రిప్‌లు వేస్తూ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అంతలోనే వీరిద్దరు విడిపోతున్నట్టు సంయుక్తంగా ప్రకటన చేసి అందరికి కోలుకోలేని షాక్ ఇచ్చారు.
అయితే వీరు విడిపోవడానికి నాలుగు నెలల ముందు చేసిన మజిలీ సినిమా షూటింగ్లో వీరు ఎలా ఉండేవారు.. అప్పటికే వీరి మధ్య గ్యాప్ ఉందా ? అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణను కూడా కొందరు ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న వేశారు. పెళ్లయ్యాక కూడా వారిద్దరి కాంబోలో మీరు సినిమా తీశారు కదా… ఆ టైంలో వారు ఎలా ఉండేవారు.. ఇద్దరి మధ్య గ్యాప్ మీరు గమనించారా ? అన్న ప్రశ్న శివకు వేశారు.
అయితే శివ నిర్వాణ అలాంటేదేం లేదని.. వారిద్దరు ఎంతో హ్యాపీగా షూటింగ్లో ఉండేవారని.. తనకు ఎంతో చక్కగా కోపరేట్ చేసేవారని చెప్పాడు. ప్రస్తుతం చైతు హీరోగా శివనిర్వాణ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇక వీరిద్దరు కలిసి మురళీమోహన్ పెంట్‌హౌస్‌లో ఉండేవారట. అప్పుడు కూడా వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని … సడెన్‌గా ఓ రోజు వాళ్లిద్దరు విడిపోతున్నారని తెలిసి షాక్ అయ్యానని చెప్పారు. ఏదేమైనా విడాకులకు నాలుగు నెలల ముందు వరకు హ్యాపీగానే ఉన్న వీరి మధ్య అంతలోనే ఏదో తెలియని పెద్ద గ్యాప్ వచ్చేసిందని దీనిని బట్టే క్లారిటీ వస్తోంది.