టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన పేరు చెప్పుకొని వారసత్వాన్ని కొనసాగించడానికి ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని ఫుల్ రేంజ్ లో దూసుకుపోతున్నారు . రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒక సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ.. అభిమానులకి తన ప్రేగ్నెన్సీ విషయంలో క్లారిటీ ఇచ్చింది .
ప్రజెంట్ ఆ పోస్ట్ ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఉపాసన పోస్ట్ చేస్తూ..” సరైన టైంలో నేను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకున్నందుకు గర్వపడుతున్నాను . ఎవరికోసమో నేను ప్రెగ్నెన్సీ ని రప్పించుకోలేదు .. సమాజం కోసం లేదా వారసత్వాన్ని కొనసాగించాలని కోరికతో.. నా వివాహ బంధాని బలోపేతం చేయాలన్న ఆశతో నేను ఈ బిడ్డ కి జన్మనివ్వలని అనుకోలేదు ..నా బిడ్డకు పూర్తి ప్రేమ – సంరక్షణ అందించడానికి నేను మానసికంగా శారీరకంగా సిద్ధం అనుకున్న టైం లోనే బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాను.. అలాంటి టైం లోనే ఆ బిడ్డకు జన్మనివ్వలని సిద్ధపడ్డాను ” అంటూ ఉపాసన చాలా బోల్డ్ గా స్పందించింది .
అంతేకాదు ఉపాసన మదర్స్ డే సందర్భంగా ఫస్ట్ టైం తన ఫుల్ బేబీ బంప్ పిక్స్ ను ఫొటోస్ ను రిలీజ్ చేసింది . ఈ క్రమంలోనే ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఏదైనా సరే ప్రతి ఆడపిల్ల ఉపాసన లా గే ఆలోచిస్తూ లైఫ్ లో ముందుకెళ్లాలనుకుంటుంది. కానీ ఉపాసన అంత ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి భయపడుతూ ఉంటుంది అన్నది మాత్రం వాస్తవం..!!