తేజ అంటేనే ఎలాంటి హీరోలతో అయినా నటన రాబట్టుకోవడంలో కొట్టిన పిండి. కొత్త నటీనటులతో కూడా తనకు కావాల్సినట్టుగా నటన చేయించుకుంటాడు. ఈ క్రమంలోనే యాక్టింగ్ సరిగా రాని దర్శకులను కొడతాడన్న పేరు కూడా ఆయనకు ఉంది. అయితే ఈ తేజకే కొరకరాని కొయ్యగా మారాడట మన సురేష్‌బాబు రెండో కొడుకు, దగ్గుబాటి వంశాకురం దగ్గుబాటి అభిరామ్
సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ హీరోగా మారాడు. అటు బలమైన కుటుంబ నేపథ్యం. బబాయ్ వెంకటేష్ స్టార్ హీరో. అన్న రానా నేషనల్ ఇమేజ్ ఉన్న హీరో. రానాకు నటనలో వంకపెట్టలేం.. ఏ పాత్రలో అయినా ఒదిగిపోతాడు. పైగా బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో వరల్డ్ వైడ్‌గా సూపర్ పాపులర్. అయితే అభిరామ్ తన తొలి సినిమాగా తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా చేశాడు.
ఈ సినిమాలో అభిరామ్ తో యాక్టింగ్ చేయించడానికి తేజకు చుక్కలు కనపడ్డాయట. ఇక క్లైమాక్స్‌లో అయితే అభిరామ్ తో సన్నివేశాలు తీయలేక తేజ చేతులు ఎత్తేశాడట. అటు హీరోయిన్ కొత్తమ్మాయి అయినా బాగా నటిస్తుంటే… అభిరామ్ మాత్రం సీన్‌కు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదట. చివరకు చెప్పి చెప్పి విసిగిపోయిన తేజ క్లైమాక్స్‌లో హీరో ఫేస్ కనడపకుండా ఫైట్ షూట్ చేశాడట.
అంటే అహింస క్లైమాక్స్ ఫైట్‌లో హీరో ఫేస్ కనిపించదట. అయితే హీరోనే ఫైట్ చేసే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఏదేమైనా అభిరామ్‌తో యాక్టింగ్ చేయించడం తేజకే చేతకాలేదంటే అభిరామ్ ఎంత గొప్ప నటుడో ? అర్థమవుతోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదాలు పడింది. జూన్ 2న తాజా రిలీజ్ డేట్ వేశారు.