ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా గత కొన్ని నెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపించాయి . దీనికి తగ్గట్టే విజయ్ వర్మతో లిప్ లాక్ చేస్తూ ఉన్న తమన్న వీడియో న్యూ ఇయర్ సందర్భంగా లీక్ అయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తమన్న విజయ్ వర్మ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . అంతేనా వీళ్ళిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో కూడా బోల్డ్ గా నటిస్తున్నాడు .
అంతేకాదు త్వరలోనే జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోని తమన్నా అమ్మగారు విజయ్ వర్మకి పెట్టిన కండిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ తన కూతుర్ని ఇవ్వాలంటే ఏ తల్లి అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తుంది ..ఎంక్వయిరీ చేసుకుంటుంది.. అయితే విజయ్ వర్మ విషయంలో మాత్రం తమన్న అమ్మగారు అలాంటివి ఏమీ చేయలేదట .
“మా బిడ్డకు ఇష్టమైతే మాకు ఇష్టమే ..కానీ ఒక కండిషన్ తమన్నా కి ఇష్టం లేని పని ఏదీ చేయకూడదు.. తమన్నా మొదటినుంచి సెన్సిటివ్ ..ఆమెను బాధ పెట్టకుండా చూసుకోవాలి.. అంతే కాదు మొదటి నుంచి తమన్నాకి ఆమె చెప్పింది పక్క వాళ్ళు వినాలి అని మొండి అలవాటు ..నువ్వు అలాగే ఉండాలి.. లేకపోతే తమన్న ఏమైనా చేస్తుంది ..కొట్టను కూడా కొడుతుంది ..వాటి అన్నిటికి నువ్వు రెడీగా ఉండాలి .. మా అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఆమెను ముట్టుకోను కూడా ముట్టుకోకూడదు” అంటూ ఓపెన్ గానే తమన్నా తల్లి చెప్పుకొచ్చిందట .
ఈ క్రమంలోనే ఎవడైనా ఇలాంటి కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తాడా..? అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తునారు. అంతేకాదు తమన్నా కొడితే కొట్టించుకోవడానికి విజయ్ వర్మ ఏమైనా చిన్న పిల్లోడా అంటూ కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . ఒకటైతే నిజం తమన్నాని పెళ్లి చేసుకుంటే విజయ్ వర్మకు చుక్కలు కనపడతాయి అన్నది మాత్రం వాస్తవం..!!