బి. సరోజాదేవి. అన్నగారు ఎన్టీఆర్ సరసన అనేక సినిమాల్లో నటించారు. పాండురంగ మహత్యం సినిమా లో వేశ్య కారెక్టర్‌ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే.. ఆమె సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత.. సావిత్రి భర్త.. జెమినీ గణేశన్‌తో మంచి కలివిడిగా ఉండేవారట. గణేశన్‌తో కలిసి విహార యాత్రలు కూడా చేశారని అంటారు. అప్పటికే సావిత్రికి వివాహం అయినా.. జెమినీ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరించేవారు.
ఎందుకంటే జెమినీ ఎంత అమ్మాయిల పిచ్చోడో తెలిసిందే. ఎవరైనా అమ్మాయి తన కంట్లో పడితే ఆమె వెంటపడి మరీ వేధించేవాడట. ఈ క్రమంలోనే బి. సరోజా దేవితోనూ గణేశన్ చనువుగా వ్యవహరించారు. ఈ విషయం తెలిసిన సూర్యాకాంతం.. వీరిద్దరి విషయాన్ని రచ్చరచ్చ చేశారు. ఇది సావిత్రి వరకు తెలిసింది. అయితే.. ఆమె సూర్యాకాంతం చెప్పిన విషయాన్ని నమ్మకుండా.. వారిని వదిలేసిందని అంటారు.
మరి జెమినీపై నమ్మకమో.. లేక సరోజ అలాంటిది కాదని విశ్వాసమో.. తెలియదు కానీ.. ఇది చాలా కాలం చర్చకు కూడా రాలేదు. పైగా సూర్యకాంతం వాళ్లపై చాడీలు చెపుతోందని సావిత్రి ఫీల్ అయ్యేవారట.
కానీ, సూర్యాకాంతం మాత్రం సరోజకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని ఒక టాక్ నడిచింది. ఇదే.. తిరుపతమ్మ కథ సహా అనే సినిమాల్లో సరోజా దేవిని ఎన్టీఆర్ తీసుకోలేదనిఅంటారు. అంతేకాదు.. అప్పట్లో అనేక పాత్రలను కూడా సరోజాదేవికి ఇవ్వలేదని చెబుతారు.
తర్వాత.. జెమినీకి ఆమెకు మధ్య వివాదం ఏర్పడి.. దూరమయ్యారు. కానీ, అప్పటికే సావిత్రి జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకు న్నాయి. ఆమె ఆసుపత్రి పాలయ్యారు కూడా. ఈ విషయం తెలిసిన సూర్యాకాంతం.. నేను చెప్పినప్పుడు విని పించుకుని ఉంటే.. ఇలా జరిగేది కాదని.. సావిత్రి కుటుంబానికి చెప్పడం గమనార్హం.