సూపర్ స్టార్ కృష్ణ లేకుండా ఆయన పుట్టినరోజు వస్తోంది. ఈ లోటు పూడ్చటానికి అన్నట్టుగా ఈనెల 31న 52 సంవత్సరాల క్రితం ఆయన నటించిన తొలి తెలుగు కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ భలే థ్రిల్ కలిగించింది. కృష్ణ అభిమానులకే కాదు ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఇదిలా ఉంటే కృష్ణకు అప్పట్లో లక్షల్లో అభిమానులు ఉండేవారు
ఆయన కోసం ఏకంగా ఆంధ్ర, తెలంగాణ నుంచి బస్సులు, రైళ్లు ఎక్కి మరి మద్రాస్ కు చేరుకునేవారు. కృష్ణ మద్రాసులో ఉంటే మద్రాసుకి, హైదరాబాదులో ఉంటే హైదరాబాద్‌కి ఆయన ఎక్కడ ఉన్నా అభిమానులు మాత్రం ఆగే వాళ్ళు కాదు. ముఖ్యంగా ఆయన పుట్టినరోజు మే 31 వస్తుందంటే చాలు అభిమానులకు ఒక పండగ.
కృష్ణకు అభిమానులు ఎలా ఉండేవారు అంటే భవాని ప్రసాద్ అనే వీరాభిమాని కృష్ణ షూటింగ్ జరుగుతూ ఉండగా తలుపు తోసుకొని మరి లోపలికి వెళ్లిపోయాడు. కృష్ణ కోపంతో తిట్టాడు. తర్వాత అతడి పిచ్చి అభిమానం అర్థం చేసుకుని భోజనం పెట్టి పంపాడు. ఆ అభిమాని కృష్ణ తనను తిట్టాడని తన ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు.
ఇక శ్రావణ్ అనే ఓ అభిమాని చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోతే మద్రాసులో కృష్ణ దంపతులు ఆదరించి తమ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ కృతజ్ఞతతోనే తన కొడుకుకి విమల కృష్ణ అని పేరు పెట్టుకున్నాడు. ఆ విమల కృష్ణ ఎవరో కాదు D.J టిల్లు దర్శకుడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. యూత్‌కు ఈ సినిమా మాంచి కిక్ ఇచ్చింది. అలా కృష్ణ ఇంట్లో పనిమనిషి కొడుకే ఈ రోజు టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా ఉన్నాడు.