సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు..నాస్తికులు. వీరిలో మన తెలుగు నాట అక్కినేని నాగేశ్వరరావు. తమిళనాడు సహా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా దేవుడిని నమ్మరు. అయితే.. వీరికి వారసులుగా ఇండస్ట్రీలోకివచ్చిన అక్కినేని నాగార్జున, కమల్ కుమార్తె శృతిహాసన్‌లు ఇద్దరూ కూడా పరమ భక్తులు కావడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు మన విధిరాత ఎలా ఉంటే అలాగే ఉంటుందని నమ్ముతారే తప్పా దేవుళ్లను ఆయన ఎక్కువుగా నమ్మడు..
అదే ఆయన కుమారుడు నాగార్జునను తీసుకుంటే.. ఆయన నెలకు ఒక్కసారైనా.. రహస్యంగా తిరుమలకు వెళ్లి వస్తారు. అంతేకాదు.. ఆయన షిర్డిసాయి సినిమాలోను, రామదాసు సినిమాలోను.. భక్తుల పాత్రలు పోషించారు. ఏకంగా షిర్డిసాయి పాత్రను పోషించారు. అంతేకాదు.. తరచుగా తిరుమలతోపాటు.. షిర్డి సాయి మందిరానికి (మహారాష్ట్ర) వెళ్లి వస్తూ ఉంటారు. ఇలా.. అక్కినేని కుటుంబంలో చిత్రమైన ఘటన ఇది.
ఇక, కమల్ హాసన్ కుటుంబం నుంచి వారసురాలిగా శృతి హాసన్ అరంగేట్రం చేశారు. స్వశక్తితోనే హీరోయిన్‌గా ఎదిగారు. తనకు తన తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారని చెప్పే శ్రుతిహాసన్ ఇప్పటికీ స్వతంత్రభావాలతోనే సినీ రంగంలో నటిగా ఎదుగుతున్నారు.అయితే.. కమలహాసన్ పక్కా నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. దీనికి విరుద్ధ భావాలు కలిగిన నటి శ్రుతిహాసన్. తనకు దైవభక్తి ఎక్కువ.
అలాగని దేవాలయాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపనని, మనసు ఆలయం అని భావిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే తన ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేసే విధంగా శ్రుతిహాసన్ తన వీపు పైభాగంలో శ్రుతి అని తన పేరుతో పాటు కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును టాటూ వేసుకున్నారు. ఇలా.. ఇండస్ట్రీలోనూ భిన్నమైన వ్యక్తులుఉన్నారన్నమాట.