ఈ మధ్యకాలంలో పెళ్లి అనే బంధం ఎంత ఆటగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ దారుణాతి దారుణమైన ఫోజులు ఇస్తూ నేటి యువత హద్దులు మీరుతుంది . ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే కనీసం ఒకరినొకరు చూసుకునే వారే కాదు.. మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేవారు. అయితే ప్రజెంట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది . ఎంతలా అంటే పెళ్లికి ముందే ముద్దులు, హగ్గులు, అన్ని పనులు కానిచ్చేస్తున్నారు . కాగా రీసెంట్గా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ క్యాషప్ కూతురు అలియా క్యాషప్ నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి.
ఆమె గత కొంత కాలం నుండి షేన్ గ్రెగోరియర్ ప్రేమలో మునిగి తేలుతుంది. ఆమె అతగాడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. దానికి లైసెన్స్ కూడా తీసుకుంది. అదే ఆమె అతగాడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది . అందులో భాగంగానే అలియా నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. పనిలో పని అతగాడితో ఘాటుగా లిప్ లాక్ చేస్తున్న ఫోటోను కూడా షేర్ చేసింది .
ఈ క్రమంలోనే ఆలియా లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు. ” నీ పెళ్లి ఏమో కానీ ..నీ ముద్దు బాగుంది” అంటూ కొందరు అంటుంటే.. నువ్వు పెళ్లికి ముందే ఎంజాయ్ చేస్తున్నావ్ ..పెళ్ళికి ముందు ఫస్ట్ నైట్ కూడా చేసేసుకుంటావా ..? ఏంటి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు హద్దులు మీరి రెచ్చిపోయి బూతులు తిడుతున్నారు. కాగా ఆ ఫోటోలను షేర్ చేస్తూ అలియా ఈ విధంగా రాసుకోవచ్చారు..” మొత్తానికి మేము అనుకున్నది జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్.. నా పార్ట్నర్ .. నా సోల్మెట్ గా.. నా భర్త అయ్యాడు.. నా జీవితానికి ఇంతకంటే ఏం కావాలి ” అంటూ తన పై ఉన్న గాఢ ప్రేమను పోస్ట్ రూపం లో తెలియజేసింది . ప్రెసెంట్ ఆలియా లిప్ లాక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!