ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటిగా.. సినీ అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తర్వాత.. భారతీయ చలన చిత్ర రంగంలో ఒక ఐకాన్‌గా ఎదిగారు. అయితే.. అదే సమయంలో తెలుగు సినిమాలంటే..ఆమె ప్రాణం పెట్టేవారు. శ్రీదేవి ఎంత ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ అయినా ఆమెను స్టార్‌ను చేసింది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీయే. ఆమెకు తెలుగు నాటే లక్షల్లో అభిమానులు ఉన్నారు.
అందుకే ఆమె ఎంత గొప్ప నేషనల్ హీరోయిన్ అయినా తెలుగు సినిమా అంటే ఎంతో ప్రేమతో ఉండేది.
తెలుగు సినిమా రంగంలో పనిచేసిన అనేక మంది హీరోయిన్లు ఆమెకు సమకాలికులు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో జయప్రద, రాధిక, రాధ, భానుప్రియ వంటివారు ఉన్నారు. వీరంతా.. కలిసి కూడా నటించిన సినిమాలు ఉన్నాయి. చిరంజీవి సరసన వీరు అనేక సినిమాల్లో కలిసి నటించారు.
అదేవిధంగా శోభన్‌బాబు, నటుడు కృష్ణ సరసన కూడా కలిసి శ్రీదేవి, రాధ, రాధికలు కలిసి నటించారు. ఇక, ఎన్టీఆర్‌తోనూ జయప్రద, శ్రీదేవిలు.. కలిసి నటించారు. అయితే.. ఎప్పుడూ ఎవరితోనూ శ్రీదేవికి వివాదాలు రాలేదు. అందరూ కలిసిమెలిసిఉండేవారు. అందరూ కలిసిమెలిసి.. షాపింగులు కూడా చేసేవారు. అయితే.. ఓ సందర్భంగా రాధిక విషయంలో శ్రీదేవికి వివాదం ఏర్పడింది. శ్రీదేవితో కలిసి నటించిన తమిళ సినిమాలో రాధిక.. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం దీనికి కారణం.
దీంతో శ్రీదేవిని కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాత కోరడం వివాదానికి దారితీసింది. అప్పట్లోనే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానిలో ఉన్న శ్రీదేవికి అంతో ఇంతో ఎక్కువగానే తీసుకునేవారు. దీనిని కార్నర్ చేస్తూ.. రాధిక.. ఆమె కన్నా ఎక్కువ ఇస్తేనే నటిస్తానని చెప్పడం వివాదంగా మారింది. చివరకు సినిమాలో ఇద్దరినీ తీసేసి సరితను తీసుకున్నారు. ఇక, ఆ తర్వాత. . నుంచి శ్రీదేవి, రాధిక కలిసి నటించలేదు.