Moviesసినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని మరో సంచలనం..అలా...

సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని మరో సంచలనం..అలా చేసిన ఫస్ట్ స్టార్ కిడ్ గా అరుదైన రికార్డ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సితార ఘట్టమనేని కి అద్భుతమైన ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సితార ఘట్టమనేని ప్రముఖ జువెలరీ బ్రాండ్ కోసం ఓ యాడ్ షూట్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ .

కాగా ఈ యాడ్ కోసం సితార ఘట్టమనేని కి భారీగానే ముట్టజెప్పిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సితార ఘట్టమనేని పేరు వైరల్ గా మారింది. అంతేకాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఇంతటి క్రేజీ ఆఫర్స్ ని పట్టలేరని .. అలాంటిది ప్రముఖ బ్రాండ్ జ్యువలరీ కి అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ గా షూట్ చేయడం చాలా గర్వించదగ్గ విషయమని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు కి తగ్గ కూతురు అంటూ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో అమ్మడుని పొగిడేస్తున్నారు.

. కాగా మొదటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న సితార ఘట్టమనేని చదువు పూర్తయ్యాక సినిమాలోకి వస్తాను అంటూ పలు షోస్ లో పాల్గొన్నప్పుడు చెప్పింది మహేష్ బాబు సైతం తన కూతురిని ఇండస్ట్రీలకు పంపించడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు అని.. ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పానని చెప్పుకొచ్చాడు. తన తండ్రి ” సర్కారు వారి పాట ” సినిమాలో పెన్ని సాంగ్ కి డాన్స్ చేసిన వీడియో అప్పట్లో ఎంత వైరల్ గా మారిందో మనందరికీ తెలిసిందే . ప్రెసెంట్ సితార జువెలరీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది అన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news