సిల్క్ స్మిత.. ఈ పేరు వినగానే.. బావలూ.. బావలూ.. సయ్యా.. అనే పాట ఠక్కున గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన సిల్క్ స్మిత తర్వాత కాలంలో వ్యాంపు పాత్రలు.. చేసింది. ఆ తర్వాత.. ఐటం పాత్రలకు పరిమితం అయింది. అయితే.. ఆమెను జీవితంలో కొందరు మోసం చేశారని.. ఆ మోసాన్నితట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనే టాక్ ఉంది. అయితే.. ఆమెను ఎవరు మోసం చేశారనేది మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలో సస్పెన్సే కావడం గమనార్హం.
1980-90ల వరకు తన అందచందాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమను సిల్క్ స్మిత ఊపేసింది. గ్లామరస్ పాత్రలు పోషిస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో సిల్క్ స్మిత ఉండాలని పట్టుపట్టేవారం టే..అప్పట్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంత ఇమేజ్‌ని సొంతం చేసుకన్న సిల్క్ స్మిత.. ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరిని కలిచివేసింది. ఓ సీనియర్ హీరో.. స్కిల్క్ స్మిత కెరీర్ నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన స్మిత.. 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్యకి ముందు ఓ సూసైడ్ నోట్ రాసుకుందనే ప్రచారం ఉంది. దేవుడా నా 7వ సంవత్సరం నుంచి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మినవారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా…అతను నన్ను మోసం చేశాడు అని పేర్కొంది. అయితే.. అతను అనే వారు ఎవరో మాత్రం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. సిల్క్ జీవితంలో ఏర్పడిన తీవ్ర విషాదానికి ఇప్పటికీ ఆమె అబిమానులు బాధపడుతుంటారు.