పాపం ..తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు ..కానీ తెలిసి తెలియక తనంతో చేసిన సినిమాలు అన్నీ సమంతకు బ్యాడ్ రిమార్క్ క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ అంచనాలతో నటించిన శాకుంతలం సినిమా అమ్మడుకు ఎలాంటి డిజాస్టర్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెట్టిన దానికి సగం కూడా రాకుండానే బాక్సాఫీస్ వద్ద సమంత సినిమా పరమ చెత్త టాక్ ని క్రియేట్ చేసుకుంది . అంతే కాదు సమంత ప్రెసెంట్ సిటాడిల్ వెబ్ సిరీస్ షూట్ లో బిజీబిజీగా ఉంది .
దీనికి సంబంధించిన పిక్స్ ను కూడా అడపాదడపా షేర్ చేస్తూ అభిమానులకి కొత్త బుస్టప్ ఇస్తుంది. అయితే రీసెంట్గా సమంత షేర్ చేసిన పిక్స్ ని ట్రోల్ చేస్తున్నారు జనాలు . సిటాడిల్ వెబ్ సిరీస్లో సమంత ఎంత కష్టమైనా స్టంట్స్ చేస్తుందో మనందరికీ తెలిసిందే . అయితే ఇలా స్టంట్స్ చేసిన తర్వాత సమంతకు బాడీపెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయట . దీని కోసమే రిలాక్సియేషన్ కోసం ఐస్ క్యూబ్స్ బాత్ ను ప్రిఫర్ చేస్తుందట. దీనికి సంబంధించిన పిక్స్ ని షేర్ చేస్తూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది .
“ఇది టార్చర్ టైం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది .దీంతో కొందరు ఆకతాయిలు “ఇక నీ పప్పులు మా దగ్గర ఉడకవు ..ప్రతిసారి సినిమా షూట్ అప్పుడు.. సినిమా ప్రమోషన్స్ కోసమే ఇలాంటి హంగామా చేస్తూ పిక్స్ పెడుతూ ఉంటావు . ఆ తర్వాత సైలెంట్ అయిపోతావు . శాకుంతలం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అసలు ఆ సినిమాని పట్టించుకోవడమే లేదు “అంటూ ఫైర్ అవుతున్నారు .
మరికొందరు సమంత జనాలను వెర్రి పుష్పాలను చేస్తుందని..? ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఒక మాయ చేసి క్రేజీ టాక్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తుందని.. ఆ తర్వాత మళ్లీ కథను మొదటిగా తీసుకొస్తుందని ..ఇప్పుడు కూడా సిటాడిల్ సిరీస్ కోసం ఇంత హంగామా చేస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత ఏదో ఊహించుకొని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్ కి గురైయేలా చేస్తుంది..!!