తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ అవ్వాలనే ఆశతో వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణ కు రమాప్రభ, గీతాంజలి (క్యామెడీ) వంటివారు .. అప్పట్లో హీరోయిన్ అవ్వాలనే ఆశతోనే సీనీరంగంలోకి వచ్చారు. కానీ, అనూహ్యంగా వారికి ఎలాంటి అవకాశాలూ దక్కలేదు. దీంతో వారుసైలెంట్ అయ్యారు. కానీ.. సినీమా రంగాన్ని మాత్రం వదులుకోలేదు. ఏదో ఒకపాత్ర కోసం.. ప్రయత్నించారు. ఆ పాత్రలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే.. ముద్దమందారం, లేడీస్ టైలర్ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్లు.. తర్వాత కాలంలో సినిమాలకు దూరమయ్యారు. ముద్ద మందారం జంధ్యాల దర్శకునిగా, ప్రదీప్, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన ప్రేమకథాచిత్రం. రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్, పూర్ణిమలు తొలిసారిగా చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. చక్కటి సంగీతం, సంభాషణలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి.
అయితే.. ఈ సినిమాలో మంచి గుర్తింపు పొందిన పూర్ణిమకు నంది అవార్డు కూడా వచ్చింది. కానీ.. తర్వాత సినిమాలు పెద్దగా రాలేదు. ఏదో చెల్లెలి పాత్రలు.. అక్క పాత్రలు.. కూతురుపాత్రలు వచ్చాయి. అయితే.. వాటిని వేసేది లేదని భీష్మించిన ఆమె.. చివరకు ఇండస్ట్రీ నుంచి బయటకువచ్చారు. పెద్దగా గుర్తింపు లేకుండా పోయారనేఆవేదన ఉన్నా.. ముద్దమందారం గురించి తెలిసిన వారు..ఇప్పటికీ పూర్ణిమను తలుచుకుంటారు.
ఇక, లేడీస్ టైలర్ సినిమాలో హీరోయిన్‌గా .. నటించిన అర్చనకు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈసినిమాలో మంచి పేరు వచ్చింది. కానీ, తర్వాత తర్వాత.. మాత్రం ఆమె కోరుకున్న విధంగా అయితే.. పేరు రాలేదు. సినిమాలు కూడా రాలేదు. నిరీక్షణ సినిమాలో గిరిజన యువతిగా భానుచందర్ సరసన చేసినా.. తర్వాత.. పెద్దగా సినిమాలురాకపోవడంతో ఆమె కూడా తెరచాటు అయ్యారు.