సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టాక ..హిట్లు కొట్టాక .. హిట్ ట్రాక్‌లోకి పడ్డాక.. సహనం, ఓపిక అనేది ఉండాలి . ఏ మాత్రం తోక జాడించినా..హెడ్ వెయిట్ ప్రదర్శించినా..సీన్ మారిపోద్ది. అదే కోవాలోఖి వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఇలియాన. మనకు తెలిసిందే దేవదాసు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఆ తర్వాత స్టార్ హీరో సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ .. సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిపోయింది . అయితే తెలుగులో వచ్చిన పాపులర్ కారణంగా బాలీవుడ్ లోనూ అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీని పూర్తిగా వదిలేసి అటువైపుగా అడుగులు వేసింది ఇలియానా . ఈ క్రమంలోనే బాలీవుడ్లో అమ్మడును ఫేడ్ అవుట్ హీరోయిన్ గా మార్చేసారు బాలీవుడ్ జనాలు .
దీంతో తెలుగులోకి రాలేక బాలీవుడ్ లో ఆఫర్లు రాక ఇలియానా నలిగిపోయింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఇలియానా ఫేవరెట్ హీరోలు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఇండస్ట్రీలో బాలీవుడ్లో స్టార్ గా ఉన్నప్పుడు తెలుగులో అవకాశాలు వస్తే రిజెక్ట్ చేసింది అన్న కారణంతో స్టార్ హీరోలు ఆమెను దూరం పెట్టారు .
ఈ క్రమంలోనే ఇలియానా తప్పు చేసింది అన్న న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది . బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్న తెలుగు జనాలని మర్చిపోకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇలియానా క్రేజ్ వేరేలా ఉండేదని .. అందుకే ఇప్పుడు ఇలియానా ని ఎవరు పట్టించుకోవడం లేదు తెలుగు హీరోలు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఇలియానా గర్భవతి .. బేబి బంప్ ఫోటోలు షేర్ చేస్తూ హ్యాపీగా ప్రెగ్నెన్సీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!