టాలీవుడ్ సీనియర్ యాంకర్ అంటే ఒకప్పుడు అచ్చ తెలుగు సంప్రదాయానికి, అచ్చ తెలుగు కట్టుబాట్లకు ఎంతో ఫేమస్. ఆమె ఈ వయస్సులోనూ కుర్ర యాంకర్లకు పోటీ ఇస్తూ, అదే సంప్రదాయాన్ని పాటిస్తూ, కట్టుబాట్లు దాటకుండా యాంకరింగ్ చేస్తూనే ఉంటోన్నారు అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లో మంచి మంచి పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు చేరువ అవుతున్నారు.
ఇక ఆమె సినిమా, యాంకరింగ్ జీవితం ఎంతో బాగున్నా.. ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పలేదు. ఆమె ముందుగా ప్రముఖ నటుడు జోగి నాయుడును ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు కాపురం చేసి.. ఓ బిడ్డను కన్నాక వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. జోగి నాయుడు మళ్లీ పెళ్లి చేసుకున్నా ఝాన్సీ మాత్రం పెళ్లికి దూరంగా అలాగే ఉంటూ వస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఝాన్సీ ఎమోషనల్ అయ్యింది. తన కెరీర్‌లో తనకు జరిగిన అన్యాయాలపై ఆమె ఓపెన్ అయ్యింది. నాతో కలిసి పనిచేసిన వారందరికి నా గురించి బాగా తెలుస్తుందని… నా గురించి తెలియని వారు.. అవతలవారితో రకరకాలుగా కామెంట్లు చేస్తారు. ఝాన్సీకి చాలా పొగరు అంటూ ఉంటారు.. నాతో కలిసి పనిచేశాక వారి అభిప్రాయం మారుతుందని చెప్పారు.
నా కెరీర్‌లో నన్ను చాలా మంది మోసం చేశారు… అవన్నీ గుర్తు పెట్టుకుని వారు నాపై కక్ష సాధించేందుకు నేను ఎప్పుడూ పని చేయలేదు.. ఇప్పటకీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే.. తనకు రావాల్సిన క్రెడిట్‌ను రాకుండా చేస్తూ ఉంటారని వాపోయింది. 24 ఎపిసోడ్లు యాంకరింగ్ చేసిన నాకు 25వ ఎపిసోడ్ కేక్ కటింగ్‌కు కూడా ఆహ్వానం ఉండదని… అలా నాకు రావాల్సిన ఛాన్సులను కూడా రాకుండా చేశారంటూ ఆమె వాపోయింది.
ఝాన్సీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆమెను సినిమా, బుల్లితెర రంగాల్లోనూ ఆమె సన్నిహితులు, ఆమెతో వర్క్ చేయించుకున్న వారు, కలిసి పనిచేసిన వారే ఆమెను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని అర్థమవుతోంది. అందుకే ఆమె ఇంతలా తన ఆవేదన వెళ్లగక్కింది.