తెలుగు తెరపై నవ్వులు పూయించిన పద్మనాభం అందరికీ తెలిసిన ఆర్టిస్టే. కడప జిల్లా పులివెందులకు చెందిన పద్మనాభం శోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. కుటుంబం తీవ్ర ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంది. డిగ్రీ వరకు నడిపించిన పద్మనాభం వారాలు చేసుకుని చదివారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా.. ఆయన డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆయన గురించి తెలిసిన.. నాగయ్య.. అవకాశం ఇచ్చారు.
తర్వాత.. అందరి మన్ననలు పొందిన పద్మనాభం.. అనూహ్యంగా ఎదిగారు. భారీగా ఆస్తులు సంపాయిం చుకున్నారు. తన లాంటి పరిస్థితి రాకూడదని భావించి అప్పటి ప్రభుత్వంతో కలిసి.. ఆయన కడపలో పెద్ద స్కూలు కట్టించారు. దీనికి విరాళం ఇచ్చినా..తన పేరు వేయకుండా షరతు పెట్టారు. అదేవిధంగా నుంగంబాక్కంలోనూ పద్మనాభం కట్టించిన అప్పర్ ప్రైమరీ పాఠశాల ఉంది. ఇలా.. విద్యకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, సినిమాల విషయానికి వస్తే.. తనే దర్శకుడిగా మారిన ఏకైక హాస్యనటుడు పద్మనాభం కావడం గమ నార్హం. దీనికి తర్వాత.. దీనికి ముందు కూడా ఎవరూ కూడా దర్శకత్వం వహించిన పరిస్థితి ఇండస్ట్రీలో లేదు. అయితే..ఇంతగా కష్టపడిన పద్మనాభం.. చివరి దశలో విరాళం కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం.. ఆయన ఆస్తులను ప్రేమికురాలు లాగేసుకుందనే చర్చ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో పద్మనాభం.. గీతాంజలితో ప్రేమ వ్యవహారం నడిపారు.
అయితే.. ఇది ఎక్కువ కాలం మనలేదు. గీతాంజలి వేరేవారిని ఇష్టపడింది. దీంతో పద్మనాభం చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తర్వాత కాలంలో మళ్లీ గీతాంజలి ఆయనకు చేరువై.. ఆస్తులు రాయించుకుందని ఒక టాక్ ఉంది. తాను మోసపోయానని పద్మనాభం విలవిల్లాడిపోయారట. అప్పట్లో ఇది కోలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్. గీతాంజలిని నమ్మిన పద్మనాభం సర్వం ఆమెపేరుతో పెట్టారని.. చివరకు ఆమె అతనిని వదిలేసిందని అంటారు.