Moviesఅయ్యయ్యో పాపం..ఎంగేజ్‌మెంట్‌ అయినా శర్వానంద్‌ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే..!!

అయ్యయ్యో పాపం..ఎంగేజ్‌మెంట్‌ అయినా శర్వానంద్‌ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే..!!

టాలీవుడ్ యంగ్ మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. ఒక హిట్టు కొట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాడు . ఒకప్పుడు వరుసగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లు అందుకున్న శర్వా.. కధ ల విషయంలో బోల్తా కొడుతూ ఉండడంతో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు . ఈ క్రమంలోనే ఆయన తాజాగా చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి.

ఇలాంటి క్రమంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు . తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో ఆయనకు జనవరిలో నిశ్చితార్థం జరిగింది . హైదరాబాదులో చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిగింది . అప్పటి నుండి వీళ్లకి సంబంధించిన అప్డేట్ ఏమి రాకపోవడంతో..వీళ్ల పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు.

ఈ క్రమంలోనే వార్తలు అటు తిరిగి ఇటు త్రిగి స్టార్ సెలబ్రిటీస్ దగ్గరకి వెళ్లి ..శర్వా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందన్న రేంజ్కి వెళ్ళిపోయాయి . తట్టుకోలేక శర్వానంద్ పరసనల్ టాఇం స్పందించింది . శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అవ్వలేదని .. ఆయన ప్రజెంట్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారని.. ఆ సినిమా షూట్ కోసం ఫారిన్ కంట్రీస్ లో 45 రోజులు పాటు ఉన్నారని.. అందుకే వాళ్ళ పెళ్లికి సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదని ..త్వరలోనే వాళ్ళు పెళ్లి డేట్ ని రిలీజ్ చేస్తారని చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోని శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయిన శర్వానంద్ పెళ్లి ఆగిపోయింది అన్న వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news