ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు . కాగా వీళ్ళు విడిపోయి దాదాపు రెండేళ్లు కావస్తుంది. ఈ క్రమంలోనే ఇంతవరకు వీళ్లు ఎందుకు విడిపోయారు..? అనేది జనాలకు ఆన్సర్ ఇవ్వలేదు.
కాగా ఈ క్రమంలోనే నాగచైతన్య తాను చేస్తున్న కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడాకులకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు. ” మేము విడాకులు తీసుకోవడానికి కారణం సోషల్ మీడియానే” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . “సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు.. తప్పుడు వార్తలు కారణంగానే ..మా మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ వచ్చి .. ఆ వివాదాలు విడాకుల వరకు వెళ్లాయి ” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . కాగా ఇదే కామెంట్స్ పై సమంత పరోక్షంగా స్పందించింది. సమంత తన ఇన్ స్టా స్టోరీలు క్రేజీ పోస్ట్ చేసుకొచ్చింది. ఈ క్రమంలోనే సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “తన ఇన్ స్టా స్టోరీలో మనమంతా ఒకటే ..కేవలం అహంకారం ..భయాలు మనల్ని దూరం చేస్తాయి ” అంటూ అర్థం వచ్చేలా కొటేషన్స్ షేర్ చేసింది. దీనితో సమంత స్టోరీలో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది . అంతేకాదు వీళ్ళు ఈగోల కారణంగానే విడిపోయారు అన్న ఊహాగానులు ఎక్కువవుతున్నాయి. ఏది ఏమైనా సరే సోషల్ మీడియానే వీళ్ళని విడగొట్టింది అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!