టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత – అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఏం మాయ చేసావే సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట .. రియల్ లైఫ్ లోను భార్యాభర్తలు గా మారిపోయారు .వీళ్ళ పెళ్లి ఎంత హంగామా మధ్య నడిచిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాగా ఆ తర్వాత వీళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి వీళ్ళు విడాకులు తీసుకున్నారు . పట్టుమంటూ 10 సంవత్సరాలు పాటు కాపురం చేయకుండా ఈ జంట విడాకులు తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .
కాగా వీళ్లు విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది . ఇలాంటి క్రమంలో గతంలో సమంత – నాగచైతన్య పై చేసిన బోల్డ్ కామెంట్స్ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత .. ప్రేమించుకున్నప్పుడు ఎలాంటి చేంజెస్ మీరు నాగచైతన్యలో గమనించారు..? అంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ..”సమంత పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు ..కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా అయిపోయాడు . మరీ ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఎటువంటి సినిమాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోకూడదు ..అంటూ స్ట్రిక్ట్‌గా కండిషన్స్ పెట్టారు “.
“అది ఎలాంటి పొజిషన్లోనైనా సరే.. అలాగే రూల్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయించాడు. అంతే కాదు పెళ్ళికి ముందు నాతో షాపింగ్ కి వచ్చి గంటలు గంటలు టైం స్పెండ్ చేసిన నాగచైతన్య పెళ్లి తర్వాత మాత్రం నాతో టైం షాపింగ్ కి వచ్చిందే లేదు “.. అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య ఉన్న స్పెషల్ బాండింగ్ గురించి అప్పట్లో ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకునేవారు . అయితే ఈ జంటకు ఏ దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ అతి తక్కువ టైంలోనే ఈ జంట విడాకులు తీసుకొని దూరం దూరంగా వెళ్ళిపోయారు. సింగిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చూద్దాం వీళ్ళ లైఫ్ లో రెండోసారి ప్రేమ పుడుతుందో లేదో..?