టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమంత.. రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ రవీంద్రన్ గురించి ఫన్ని పోస్ట్ చేసుకొచ్చింది .
మనకు తెలిసిందే రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి – సమంత ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారో. సమంత ప్రతి సినిమాకు డబ్బింగ్ చెప్పేది చిన్మయి నే.. నిజానికి సమంత ఇంతటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి మెయిన్ రీజన్.. ఆమె వాయిస్ అని చెప్పక్కర్లేదు . అలా కామన్ ఫ్రెండ్స్ గా మారిపోయిన ఈ ముగ్గురు ఇప్పుడు జాన్ జిగిడి దోస్తులుగా ఉన్నారు. రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో రాహుల్ రవీంద్రన్ గురించి ఓ ఫన్ని పోస్ట్ చేసింది .
“పెళ్లిలో ఈ భోజనాలు కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు తెలియదు కానీ..” బ్రో ముందు భోజనం చేసి వెళ్ళండి” అని ఉండే పోస్ట్లు ని పెట్టి సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రను ట్యాగ్ చేసింది. దీనితో ఈ పోస్ట్ చూసినా అందరూ రాహుల్ రవీంద్రన్ ఇంత తిండిబోతా..? అంటూ కౌంటర్ వేస్తుంటే మరి కొందరు రాహుల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ సమంత ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారా..? అంటూ కూడా జనాలు చర్చించుకుంటున్నారు . మొత్తానికి సమంత ఓ హీరో టాప్ సీక్రెట్లు బయటపెట్టేసింది..!!