టాలీవుడ్లో దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు నటవారసత్వాన్ని అంది పుచ్చుకొని సినిమాల్లోకి వచ్చాడు నాగార్జున. ఆరు పదుల వయసు దాటుతున్నా కూడా ప్రస్తుతం స్టార్ హీరోలకు పోటీగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు నాగార్జున. నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలు అయ్యారు. అయినా నాగ్ ఛరిష్మా మాత్రం తగ్గలేదు. నాగార్జున ఆరు పదుల వయస్సు దాటేసినా కూడా రొమాంటిక్ హీరోగా ఇప్పటికే అదే పేరు కంటిన్యూ చేసుకుంటున్నాడు.
నాగార్జున అంటే ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. మాంచి రొమాంటిక్ హీరో, మన్మథుడు. ఇలా ఎన్నో బిరుదులు నాగ్‌కు ఉండేవి. నాగ్ అంటే అమ్మాయిలు పడి చచ్చేవాళ్లు. నాగార్జున ఫామ్‌లో ఉన్నప్పుడు మనోడు మంచి ప్లే బాయ్ అన్న బిరుదు తెచ్చుకున్నాడు. హీరోయిన్ అమలను బుట్టలో వేసుకుని భార్యను చేసుకున్నాడు. ఇక టబుతో నాగ్ ప్రేమాయణం తెలిసిందే.
ఇక శ్రియ, రమ్యకృష్ణ, సౌందర్య లాంటి వాళ్లతోనూ నాగార్జున సంథింగ్ సంథింగ్ నడిపాడు అన్న గుసగుసలు అయితే ఉన్నాయి. అయితే నాగార్జునకు ఇండస్ట్రీలో సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లు కూడా కొందరు ఉన్నారు. వీళ్లలో మహిళా నటీమణులు కూడా ఉండడం విశేషం. వారిద్దరు ఎవరో కాదు సీనియర్ నటి లక్ష్మి, సీనియర్ యాంకర్ ఝాన్సీ కావడం విశేషం.
లక్ష్మి అంటే చిన్నప్పటినుండే నాగార్జునకు చాలా ఇష్టమట. లక్ష్మి కొన్ని సినిమాల్లో నాగ్‌కు తల్లిగా చేసింది. ఇక యాంకర్ ఝాన్సీని నాగ్ తమ ఫ్యామిలీ మెంబర్‌లాగా చూసుకుంటాడట. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. గతంలో నాగార్జున నటించిన చాలా సినిమాల్లో ఝాన్సీ కూడా నటించింది. ఇక ఝాన్సీ కూడా నాగ్ ఇంటికి వెళ్లడం, నాగ్‌ను తన తోటి కుటుంబ సభ్యుడిలానే ట్రీట్ చేయడం చేస్తోందట.