సినిమా రెమ్యూనరేషన్ విషయంలో హీరోకు, హీరోయిన్ల మధ్య తేడాలు ఉంటాయి. ఎవరో నయనతార లాంటి ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లను మినహాయిస్తే ప్రతి సినిమాకు హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది. ఎంత గొప్ప హీరోయిన్ అయినా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అంటే చాలా ఎక్కువ అంటారు. అదే బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఎనిమిది నుంచి పది కోట్ల వరకు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంపై ఎంతోమంది హీరోయిన్లు తరచూ తమ గళాన్ని వినిపిస్తూ ఉంటారు.
బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. తాము హీరోలకు ఏమాత్రం తీసిపోమని.. నటనతో వారితో సమానంగా పోటీపడతామని అయితే రెమ్యూనరేషన్ విషయంలో చాలా తేడా ఉంటుందని గగ్గోలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. ఉత్తరాది బ్యూటీ అయిన రకుల్ దక్షిణాదిలో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
ఇక్కడ స్టార్ హీరోలు అందరితోనూ వరుసపెట్టి సినిమాలు చేసింది. తమిళంలోనూ కొన్ని సినిమాలలో నటించినా పెద్దగా విజయాలు అందుకోలేదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. అలాగే శివ కార్తికేయనుకు జంటగా నటించిన అయిలాన్ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మార్కెట్ బాగా డౌన్ అయింది. అందుకే ఓ ప్రియుడిని చూసుకుని డేటింగ్ కూడా మొదలు పెట్టేసింది.
త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది. ప్రస్తుతం రకుల్‌కు మార్కెట్ లేకపోయినా హీరోయిన్ లకు రెమ్యూనరేషన్ విషయంలో అన్యాయం జరుగుతోందంటూ గోగ్గోలు పెడుతూ ఉండటం విచిత్రం. నిజం చెప్పాలంటే హీరో, హీరోయిన్ల ప్రతిభను బట్టి రెమ్యూనరేషన్ నిర్ణయించాలని.. అలా కాకుండా హీరోలకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితి మారాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పింది. సినిమా కోసం హీరో హీరోయిన్ ఒకేలా కష్టపడతారని.. అయినా రెమ్యునరేషన్ విషయంలో ఎందుకు ఇంత తేడా ?చూపిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వాపోయింది.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రతిభ హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్లకు ఉందని రకుల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. సినిమాలో కథానుగుణంగా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే అది సక్సెస్ అయినట్లేనని.. అంతేతప్ప అందులో ఎవరు నటించారని ముఖ్యం కాదని నీతులు చెబుతోంది రకుల్. మరి రకుల్ గోడును ఎవరైనా పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.