కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే . చెప్పే ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తుంది..వినే కొద్ది ఇంకా వినాలి అనిపిస్తుంది . అంతలా తన కెరియర్లో చెరగని ముద్ర వేయించుకున్నాడు రజనీకాంత్ . ఆయన సినీ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే కనిపిస్తుంది . బస్ కండక్టర్గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తూ కొన్ని వందల కోట్ల ఆస్తికి అధిపతుడిగా ఉన్నాడు.
ఇప్పటికి సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా రజనీకాంత్ చక్రం తిప్పుతున్నాడు అనడంలో ఆశ్చర్యం లేదు . ఈ క్రమంలోని రజనీకాంత్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనరల్ గా స్టార్ సెలబ్రిటీ ఆస్తులు అన్ని తమ వారసులకు రాసుకోస్తూ ఉంటారు . అయితే రజనీకాంత్ మాత్రం ఆ విషయంలో విభిన్నంగా ఆలోచించాడు . ఆయన ఆస్తులు అన్ని తన తదనంతరం ఎవరికి దక్కుతాయో వీలునామా రాసుకోచ్చారట .
ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. రజినీకాంత్ ఇప్పటికీ యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే . కొన్ని వందల కోట్ల ఆస్తి రూపాయలను రజినీకాంత్ కూడ పెట్టారు. అయితే రజనీకాంత్ కి ఉండేది ఇద్దరు కూతుర్లు మాత్రమే .. ఇద్దరు కూతుర్లకు ఎంత ఆస్తిఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే కోట్ల ఆస్తిని సంపాదించిన రజనీకాంత్ సగం వాటా= కూతురులకి సగం వాట పేద ప్రజలకి చెందాలని వీలునామాలో రాసారట . ఈ విషయంపై కూతుర్లు కూడా అడ్డు చెప్పకపోవడం గమనార్హం. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయానికి కుటుంబం కూడా అంగీకరించింది . అంతేకాదు కోలీవుడ్ జనాలు సైతం రజనీకాంత్ తీసుకున్న బోల్డ్ డెసిషన్ స్వాగతిస్తున్నారు. రియల్ సూపర్ స్టార్ అంటే నువ్వే అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!