టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా 30వది కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ 31వ సినిమా కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ తన కెరీర్‌లో నటించిన సినిమాల్లో చాలా పాపులర్ డైలాగులు ఉన్నాయి.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాడంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఎన్టీఆర్ డైలాగులకు తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ బాక్సులు బద్దలయ్యేలా చెప్పిన ఆ పాపులర్ డైలాగుల్లో కొన్నింటిని కొద్దిగా చూద్దాం.
ఆది – అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా
సాంబ – నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్.. నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావ్… ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతావ్..
సింహాద్రి: పదిమంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికి అయినా.. చంపడానికి అయినా సిద్ధం.
యమదొంగ:
రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో.. పులితో ఫొటో దిగాలనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా ట్రై చేస్కో… సరే చనువిచ్చింది కదా అని పులితో ఆటాడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తది.
బృందావనం:
సిటీ నుంచి వచ్చాడు… సాఫ్ట్‌గా లవర్‌బాయ్‌లా ఉన్నాడనుకుంటున్నాడేమో…. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా… లోపల ఒరిజినల్ అలాగే ఉంది.. దానిని బయటకు తెచ్చాననుకో రచ్చ రచ్చే..!
ఊసరవెల్లి:
కరెంటు వైరు కూడా నాలాగే సన్నగా ఉంటుంది. కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే సాలీడ్‌గా ఉంటుంది.
బాద్ షా:
బాద్ షా టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‌గా ఉంటుంది.. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే.. బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది.. భయపడేవాడు బానిస.. భయపెట్టేవాడు బాద్ షా.
జనతా గ్యారేజ్:
బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ ఛేంజ్. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది.
టెంపర్:
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదపడిపోతే దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర.
నా పేరు దయ.. నాకు లేనిదే అది.
ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుంది… యూజర్ నేమ్ దయ, పాస్‌వర్డ్ పోలీస్.. దమ్ముంటే దయాగాడి వైఫై దాటిరండ్రా..
దమ్ము:
బతకండి బతకండి అంటే వినలేదు కదరా… కోత మొదలైంది రాతరాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు.. చరిత్ర చరిత్ర అంటూ నీలిగావు కదరా… గేటుదగ్గర మొదలు పెడితే గడప దగ్గరకు వచ్చేసరికి నీ చరిత్ర ముగిసిపోయింది..