సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన కొందరు హీరోయిన్లు.. ఎలా మరణించారు? వారు మరణించడానికి కారణం ఏంటి? అనేది ఇప్పటికీ ఇండస్ట్రీలో మిస్టరీగానే ఉండిపోయింది. ఇలాంటివారిలో కొందరు తెలుగు , మరికొందరు తమిళన నటీమణులు కూడా ఉన్నారు. ఉదాహరణకు దివ్య భారతి.. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని ఊపేసింది. చిన్నవయసులోనే మంచి మంచి హిట్లుఅందుకుంది. బాలకృష్ణ నుంచి వెంకటేష్‌వరకు ఎంతో మంది సరసన నటించింది.
అయితే.. అంతే రేంజ్‌లో ఉన్న సమయంలో దివ్యభారతి అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం ఇప్పటికీ సస్పె న్స్ నే ఉండిపోయింది ఇక, మరో నటి సిల్క్ స్మిత. ముందు హీరోయిన్‌గా రంగంలోకి వచ్చినా.. తర్వాత.. వ్యాంపు పాత్రలు చేసింది. అయితే.. ఆమె కూడా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరో ఒకరు మోసం చేశారని మాత్రమే తెలుసుకానీ.. ఎవరు ఎందుకు? అనేది ఇప్పటికీ సందేహమే.
ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్.. శ్రీదేవి మృతి కూడా భారత చలన చిత్రరంగంలో మిస్టరీగానే మిగిలిపోయింది. ఒక వివాహానికి దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి.. అక్కడ ఆడుపాడుతూ కనిపించారు. అనంతరం తెల్లవారే .. హోటల్ గదిలోని బాత్ రూమ్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో శవమై కనిపించారు. దీనికి కారణాలపై ఇప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. అయితే.. దుబాయ్ ప్రభుత్వం మాత్రం దీనిని ప్రమాదవశాత్తు జరిగిందని మాత్రమే చెప్పి చేతులుదులుపుకొంది.
ఇక, తమిళనాడు సీఎం, ఒకప్పటి హీరోయిన్.. జయలలిత మరణం గురించి అందరికీ తెలిసిందే. ఆమె మరణం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే జరిగింది . కానీ, కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియకపోవడం.. దీనిపై ఏకంగా. ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేయడం కూడా తెలిసిందే. అయితే, ఇప్పటికీ కారణాలు ప్రపంచానికి తెలియవు. ఇలా.. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ల మరణం వెనుక ఉన్న రీజన్లు సస్పెన్సుగానే ఉండడం గమనార్హం.