Movies"మా కల నెరవేరింది".. అభిమానులకు నయన్-విగ్నేశ్ గుడ్ న్యూస్..పిక్స్ వైరల్..!!

“మా కల నెరవేరింది”.. అభిమానులకు నయన్-విగ్నేశ్ గుడ్ న్యూస్..పిక్స్ వైరల్..!!

సౌత్ ఇండస్ట్రీలోని క్రేజీయస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార .. ప్రజెంట్ ఎంత హ్యాపీగా ఉందో మనకు తెలిసిందే . గత ఏడాది జూన్ లో కొలివుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. తర్వాత ఎన్ని ఊహించిన చిక్కుల్లో ఎదుర్కొందో మనం చూస్తూనే వచ్చాం. పెళ్లయిన నాలుగు నెలలకి సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన నయనతార ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉంది .

రీసెంట్ గా మదర్స్ డే సందర్భంగా నయనతార తన ఇద్దరు పిల్లలు ఫొటోస్ ను షేర్ చేసింది . తన పిల్లలతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పుకొచ్చింది . నయనతార – విగ్నేష్ శివన్ షేర్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మదర్స్ డే సందర్భంగా తన ఫ్యామిలీ కి సంబంధించిన కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నారు విగ్నేశ్.. భార్య మదర్ హుడ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

“ప్రపంచంలోనే ఉత్తమమైన తల్లివి నీవు ..తల్లి అయిన తర్వాత ఫస్ట్ మదర్స్ డే నీకు ఇది.. తల్లిగా నీకు 10 కి 10 మార్కులు వేయాలి.. ఆ దేవుడు నీకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ..పిల్లలతో మనకల నెరవేరింది” అంటూ నయనతార ఫొటోస్ కి కామెంట్ పెట్టాడు . ఈ ఫొటోస్ లో నన్య పిల్లలు చాలా క్యూట్ క్యూట్ గా ఉండడంతో నయనతార ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news