టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న సంతోష్ శోభన్ .. తాజాగా నటిస్తున్న సినిమా “అన్ని మంచి శకునములే “. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమా మే 18న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.
ఈ క్రమంలోనే సినిమాకి వన్ ఆఫ్ ద గెస్ట్ గా వచ్చిన అల్లరి నరేష్ స్టేజ్ పై తనదైన స్టైల్ లో చమత్కరించాడు . యాంకర్ సుమ స్టేజ్ పైకి పాల గ్లాసు ..మల్లెపూలు తీసుకు రాగానే ..కొంచెం ఫన్ నడిపించారు . అంతేకాదు సుమ తెచ్చిన పూలు చేతికి చుట్టుకుని ఫస్ట్ నైట్ పెళ్లి కొడుకుల వాసన చూస్తూ ఎంజాయ్ చేశారు . అంతేకాదు ఆయన స్టేజిపై మైక్ తో మాట్లాడుతున్నంతవరకు చేతికున్న మల్లెపూలను తీయలేదు .. మధ్య మధ్యలో వాసన చూస్తూనే ఉన్నాడు .
అంతేకాదు ఈవెంట్లో స్టేజిపై మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ కు ఘాటుగా కౌంటర్స్ ఇస్తూనే పొగిడేశారు . ” ఆయనలా ఎక్కడపడితే అక్కడ నేను విజిల్స్ వేయలేనని .. నేను విజిల్ వెయ్యాలంటే నా పక్కన నచ్చిన వాళ్ళు నా వెనకాల నా బలగం ఉండాలి” అంటూ పరోక్షకంగా తగలాల్సిన వాళ్లకి కౌంటర్ వేశారు . ఈ క్రమంలోనే స్టేజిపై నరేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ వయసులో కూడా చేతికి మల్లెపూలు చుట్టుకుని నరేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోతూ కామెంట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!