వెంకటేష్ సహా అప్పటి యంగ్ హీరోలతో కలిసిన నటించిన నగ్మా ఉత్తరాదికి చెందిన నటీమణి. అయితే.. ఈమెను ఓ ఫంక్షన్‌లో చూసిన దిగ్గజ నిర్మాత రామానాయుడు .. ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక అక్కడి నుంచి నగ్మా దూకుడుగా ముందుకు సాగింది. మేజర్ చంద్రకాంత్ సహా అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. చిరంజీవి సరసన కూడా హీరోయిన్ వేషాలు అందిపుచ్చుకుంది. అయితే.. నగ్మాలో కేవలం.. నటనేకాదు.. అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
ఆమె వృత్తి పరంగా టీచర్. దీంతో యూపీలో భారీస్థాయిలో కార్పొరేట్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఇక, నటన పరంగా ఆమె బాంబే ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంది. దీంతో దానినికూడా తనకు అనుకూ లంగా మార్చుకుని బాంబేలోనే డ్యాన్స్ స్కూల్ పెట్టింది. ఆర్థికంగా.. ఎక్కడా తగ్గకుండా.. ప్రతి రూపాయినీ తీసుకునేదట. నిజానికి కొన్ని కొన్ని సినిమాల్లో నిర్మాతలు.. హీరోయిన్లకు ఇస్తామన్న సొమ్ము ఇవ్వకుండా.. ఎగ్గొట్టే వారనే పేరుంది.
అయితే.. ఇలా నగ్మాకు కూడా రెండు మూడు సినిమాల్లో పరిస్థితి యాంటీగా మారింది. ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోతే.. నగ్మా ఊరుకునేది కాదట. వెంటనే తనకు ఉన్న పరిచయాలతో వారిపై ఒత్తిడి తెచ్చి.. ప్రతి రూపాయినీ రాబట్టుకునేదట. ముఖ్యంగా రామానాయుడితో నగ్మాకు అత్యంత దగ్గర చనువు ఉందని ఇండస్ట్రీ టాక్. ఇదిలావుంటే.. ఆమెలో ఉన్న మరో కోణం.. రాజకీయం. రాజకీయాల్లో ఆమె ఫైర్‌బ్రాండ్ అన్న సంగతి.. చాలా తక్కువ మందికే తెలుసు.
యూపీలో రాజకీయాల్లోకి వచ్చిన నగ్మా లోక్‌సభకు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. విపక్షాలపై విరుచుకుపడడంలోనూ .. కామెంట్లు చేయడంలోనూ నగ్మా స్టయిలే వేరని అంటారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు ఆశించినా రాలేదు. సో.. మొత్తానికి నేటి తరం హీరోయిన్లకంటే ధీటుగా.. ఇప్పటికీ నార్త్‌లో బుల్లి తెరపై అనేక సీరియళ్లు తీస్తూ.. నగ్మా.. తనదైన శైలిలో దూసుకుపోతోంది.