టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత – హీరో నాగచైతన్యలకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ ప్రేమ పెళ్లికి మెయిన్ పునాది పడింది బీజం పడింది ఏం మాయ చేసావే సినిమాతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు . ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ..వైరల్ అవుతున్నాయి .
ఈ క్రమంలోనే రీసెంట్గా అసలు వీళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారు అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట . రీసెంట్ ఈ జంట విడాకులు ఎందుకు తీసుకున్నారో క్లారిటీ ఇచ్చాడు నాగ చైతన్య. తాజాగా కస్టడి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య తాను ఎందుకు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చిందో అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు . తమ విడాకులకి ప్రత్యక్ష – పరోక్ష కారణం సోషల్ మీడియా అంటూ తేల్చేశాడు నాగచైతన్య .
ఈ క్రమంలోనే ఆయనకు శోభిత ధూళిపాలపై వస్తున్న రూమర్స్ పై పరోక్షకంగా కౌంటర్ వేశాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే నాగచైతన్య మాట్లాడుతూ..” రీసెంట్గా నాపై ఎన్నో రూమర్ల వైరల్ అవుతున్నాయి.. జనాలు ఇప్పటికే నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు . సంబంధం లేని మూడో వ్యక్తిని తీసుకువస్తున్నారు.. అనవసరంగా ఆమెను అగౌరవ పరుస్తున్నారు.. జీవితంలో ప్రతిదీ ఒక గుణపాఠమే.. ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటాం ..ప్రస్తుతం ఏం జరిగినా.. అది నా మంచికే అనుకుంటాను ..హ్యాపీగా ఫీల్ అవుతున్నాను “అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నాగచైతన్య మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!