MoviesTL రివ్యూ: క‌స్ట‌డీ… ప్రేక్ష‌కులు పారిపోకుండా క‌ట్ట‌డి చేయ‌లేం..!

TL రివ్యూ: క‌స్ట‌డీ… ప్రేక్ష‌కులు పారిపోకుండా క‌ట్ట‌డి చేయ‌లేం..!

టైటిల్‌: క‌స్ట‌డీ
నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్
సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి
ఎడిటర్: వెంకట్ రాజన్
మ్యూజిక్‌: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శక‌త్వం : వెంకట్ ప్రభు
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్‌ : మే 12, 2023

అక్కినేని ఫ్యామిలీకి గ‌త కొంత కాలంగా వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌వుతున్నాయి. తండ్రి నాగార్జున‌, ఇటు కొడుకులు చైతు, అఖిల్ న‌టించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్ కావ‌ట్లేదు. ఈ నెల‌లోనే వ‌చ్చిన అఖిల్ ఏజెంట్ డిజాస్ట‌ర్‌. అటు అన్న చైతు న‌టించిన థ్యాంక్యూ, లాల్‌సింగ్ చ‌ద్దా కూడా డిజాస్ట‌ర్లే. ఈ క్ర‌మంలోనే త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో చైతు న‌టించిన సినిమా క‌స్ట‌డీ. కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. మ‌రి ఈ సినిమాతో అయినా చైతు హిట్ ట్రాక్ ఎక్క‌డో లేదో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
శివ (నాగ చైతన్య) ఒక సిన్సియర్ కానిస్టేబుల్‌గా డ్యూటీ అంటే ప్రాణం ఇస్తూ ప‌ని చేస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే రేవతి (కృతి శెట్టి) తో ప్రేమలో ఉంటాడు. రేవతి కూడా శివని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది. అయితే వీరి కులాలు వేర్వేరు కావ‌డంతో రేవ‌తి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు. ఈ నేప‌థ్యంలోనే రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేస్తాడు శివ‌. రాజును చంప‌డానికి పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీల గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. అస‌లు ఈ రాజు ఎవ‌రు ? రాజును ఎలాగైనా సీబీఐకు అప్ప‌గించాల‌ని శివ అంత ప్ర‌య‌త్నాలు ఎందుకు ? చేస్తాడు. ఈ ప్ర‌యాణంలో శివ‌కు ఎదురైన స‌వాళ్లు ఏంటి ? శివ త‌న ప్రేమ‌ను నెగ్గించుకున్నాడా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
నాగచైతన్య తన కెరీర్ లో శివ పాత్ర‌ను ఒక ఛాలెంజ్ గా తీసుకుని చేసిన‌ట్టుగా ఉంది. త‌న గ‌త సినిమాల కంటే చాలా సెటిల్డ్‌గా చేశాడు. హీరోయిన్‌తో ప్రేమ సీన్లు, ఇటు యాక్ష‌న్ సీన్ల‌లో చైతు న‌ట‌న సూప‌ర్బ్‌. హీరోయిన్ కృతి శెట్టి తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల ఆమె ఎక్స్‌ప్రెష‌న్ల‌తో పాటు నటన బాగుంది.
ఇక ఈ సినిమాకు మ‌రో మేజ‌ర్ ఎస్సెట్ అరవింద్ స్వామి. నమ్మిందే న్యాయం అనుకుని అతడు చేసే క్రైమ్ లో కూడా కామెడీ పడిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

అరవింద్ స్వామి పాత్ర‌తో చెప్పించిన కొన్ని డైలాగులు పేలాయి. కమీషనర్ నటరాజన్ గా శరత్ కుమార్ నటన బాగుంది. ఇక ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్‌తో పాటు మిగిలిన నటీనటులు పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక క‌థ‌నం విష‌యానికి వ‌స్తే సినిమాలో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ కొన్ని చోట్ల స్లో అనిపించింది.

దర్శకుడు వెంకట్ ప్రభు సెకండాఫ్‌లో కథనం విషయంలో స‌రిగా ట్యాకిల్ చేయ‌లేక‌పోయాడు. సెకండాఫ్ లో సినిమా చూస్తుంటే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ క్రియేట్ చేసే స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. సెకండాఫ్‌ను ఎమోష‌న‌ల్‌గా న‌డిపే ప్ర‌య‌త్నం చేసినా అది స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక కథ కూడా సింపుల్ గా ఉండటం, ఏం జరుగుతుందో ముందే ప్రేక్షకులకు అర్థం అయిపోతుండటంతో సినిమాలో ఇంట్రెస్ట్ మిస్ అయింది.

కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ తో పాటు చేజింగ్ సీన్లు, పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. యాక్షన్ థ్రిల్లర్లు తెర‌కెక్కించే విష‌యంలో పెట్టింది పేరు అయిన వెంకట్ ప్రభు ఈసారి కూడా సెటప్ కరెక్ట్ గా సెట్ చేసాడు. క‌స్ట‌డీకి స్లో ట్రీట్‌మెంట్ మేజ‌ర్ కంప్లైంట్‌. క‌థ‌నం చాలా న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
ఇక టెక్నిక‌ల్‌గా యువన్ శంకర్ రాజా, ఇళయరాజా కలిసి హ్యాండిల్ చేసిన మ్యూజిక్ తేలిపోయింది. నేప‌థ్య సంగీతం బాగున్నా పాట‌లు వ‌ర్క‌వుట్ కాలేదు. సినిమాటోగ్రఫీ కూడా. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది.

ఫైన‌ల్గా….
కస్టడీ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో మెయిన్ పాయింట్‌, యాక్ష‌న్ సీన్లు బాగున్నాయి. క‌థ సింపుల్‌గా ఉండ‌డం, స్లో స్క్రీన్ ప్లే, లాజిక్ లెస్ సీన్లు సినిమాకు మైన‌స్‌. భారీ కాస్టింగ్ ఉన్నా సినిమా స‌హ‌నాన్ని ప‌రీక్షించేదిగా ఉంది. క‌నీసం స‌గ‌టు ప్రేక్ష‌కుడిని కూడా ఆక‌ట్టుకోలేదు. నాగ‌చైత‌న్య కెరీర్‌లో మ‌రో నిరాశ‌ప‌రిచే చిత్రంగా క‌స్ట‌డీ మిగిలిపోనుంది.

ఫైన‌ల్ పంచ్ : ప్రేక్ష‌కుల స‌హ‌నానికి క‌స్ట‌డీ

క‌స్ట‌డీ TL రేటింగ్ : 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news