Newsఛీ ఛీ.. నాగచైతన్య అంతకు దిగజారిపోయాడా..? అక్కినేని పరువు గొవిందా గోవిందా..!!

ఛీ ఛీ.. నాగచైతన్య అంతకు దిగజారిపోయాడా..? అక్కినేని పరువు గొవిందా గోవిందా..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో.. అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ సమంతల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నాగచైతన్య నటించిన “కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఫస్ట్ టైం తన విడాకులు ఎందుకు తీసుకున్నానో విషయాన్ని చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు .

ఈ క్రమంలోనే నాగచైతన్య ..”మా విడాకులకి కారణం సోషల్ మీడియానే అని ..లేనిపోని వదంతులు సృష్టించింది. మా మధ్య గ్యాప్ పెంచి ఆ గ్యాప్ ని విడాకులు తీసుకున్న వరకు తీసుకొచ్చారు “అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే నాగచైతన్య పై సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కూడా జరుగుతుంది . ఇన్నాళ్లు విడాకులపై నోరు విప్పని నువ్వు ఇప్పుడు విప్పావు దానికి కారణం ఏంటి..? అసలు నువ్వు సమంతకి విడాకులు ఇచ్చిందానికి కారణం సోషల్ మీడియా అంటున్నావు..? సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నిన్నెవరు నమ్మమన్నారు ..? నీకు నిజంగా సమంత అంటే ప్రేమ ఉంటే అసలు నువ్వు విడాకులు ఎందుకు ఇచ్చావు ..? అంటూ ప్రశ్నిస్తున్నారు .

అంతేకాదు కేవలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నువ్వు ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణాది దారుణంగా ఉంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు కావాలని సమంత ఫ్యాన్స్ ను నువ్వు మంచి చేసుకోవడానికి చివరలో ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అనే డైలాగ్ వాడవని.. సమంతకి మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది ..? అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు నీ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారి పోతావా..? ఆఖరికి నీ ప్రేమ – పెళ్లి – విడాకులని వాడుకుంటావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news