టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత – హీరో నాగచైతన్యలకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇద్దరు స్టార్ సెలబ్రెటీసే కావడంతో ఎప్పుడు జనాలు వీళ్ల పై ఓ కన్ను వేసే ఉంటారు . మరి ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండడంతో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ గా మారాయి . అంతేకాకుండా కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య – సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది .
ఈ జంట విడాకులు ఎందుకు తీసుకున్నారో ఎవ్వరికి అర్ధం కాక బుర్ర పీక్కున్నారు. దీని పై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు నాగ చైతన్య . “కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న నాగచైతన్య విడాకులపై ఫస్ట్ టైం స్పందించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య మాట్లాడుతూ ..విడాకుల పై సంచలన కామెంట్స్ చేశారు.
“మేము విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు కావస్తుంది. ఏడాది కిందనే మాకు చట్టపరంగా విడాకులు కూడా అందాయి . ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నాం . ఆమెతో విడిపోయిన ఆమె ఇష్టాలను విలువలను గౌరవిస్తాను ..నిజంగా సమంత అన్ని ఆనందాలకు అర్హురాలు..నిజం చెప్పాలంటే మా విడాకులకి కారణం సోషల్ మీడియానే.. మేము విడిపోవడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఊహాగానాలే..ఆ వార్తల వల్లే మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.. ఆ తర్వాత ఆ రూమర్లను పట్టించుకోలేదు ..కానీ ఆ తర్వాత అవి కాస్త పెద్దగా మారాయి ..అవికాస్త డివోర్స్ దాకా వెళ్ళిపోయాయి . ఈ క్రమంలోనే విడిపోవాల్సి వచ్చింది “అంటూ ఫస్ట్ టైం తన విడాకులపై ఓపెన్ గా స్పందించాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నాగచైతన్య మాటలు వైరల్ గా మారాయి..!!