స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “అన్న” అనే పదం ఆయనను చూశాక పుట్టిందేమో అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు . ఇండస్ట్రీలో అంత మంచి పేరుని సంపాదించి పెట్టుకున్నారు నందమూరి తారక రామారావు గారు . కాగ 2023 మే 28 నందమూరి తారక రామారావు గారి సట జయంతి జరుగుతుండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు.. టిడిపి శ్రేణులు . ఈ కార్యక్రమంలో భాగంగానే రీసెంట్గా విజయవాడలో భారీ సభ నిర్వహించారు.
రీసెంట్గా హైదరాబాద్ కెపిహెచ్ బి గ్రౌండ్స్ లో మరోసారి భారీ సభను ఏర్పాటు చేశారు టీం . ఈ క్రమంలోనే ఈవెంట్ కి ఇండస్ట్రీ నుంచి స్టార్ ప్రముఖులందరూ హాజరయ్యారు . ఇదే క్రమంలో స్టేజి పైకి ఎక్కి మైక్ పట్టుకున్న అక్కినేని మనవడు నాగచైతన్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగ కొన్ని నెలల ముందే నాగచైతన్య – బాలకృష్ణల మధ్య ఎలాంటి వార్ జరిగిందో మనకు తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య టంగ్ స్లిప్ అవ్వడంతో నాగచైతన్య – అఖిల్ సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యారు.
ఆ టైంలో కొందరు ఫ్యాన్స్ కూడా హద్దులు మీరారు.. ఏన్ ఎన్ ఆర్ తోపు అన్ని.. ఎన్ టీఆర్ ఫ్లాపు అని రకరకాలు గా ట్రోల్ చేశారు. సీన్ కట్ చేస్తే ..ఆ వివాదం అక్కడితో ఎండ్ అయిపోయింది. ఎన్ టీఆర్ శత జయంతి ఈవెంట్ కి నాగచైతన్య వస్తాడా లేదా అంటూ అనుమానం పడ్డ అభిమానులకు నాగ చైతన్య భారీ ఝలక్ ఇచ్చాడు . అటువంటి ఏవి ఆలోచనలు పెట్టుకోకుండా నాగచైతన్య ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు .
నాగచైతన్య మాట్లాడుతూ ..”ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు బాలకృష్ణ గారికి చాలా చాలా కృతజ్ఞతలు . నందమూరి తారకరామారావు గారు నటన ..అందం.. వాత్సల్యం గురించి నేను సపరేటుగా ఏం చెప్పనవసరం లేదు , అది అందరికీ తెలిసిందే . ఇప్పటికి రాముడు – కృష్ణుడు అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది ఆయన రూపమే ..మా ఇంట్లో తాతగారు ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడిన ఎంతో గొప్పగా గౌరవంగా మాట్లాడుతుండేవారు . నిజానికి ఆయన గురించి మాట్లాడకుండా మా ఇంట్లో ఒక్కరోజు కూడా గడిచేది కాదు ” అంటూ ఎన్టీఆర్ తో ఉన్న ప్రత్యేక బంధాన్ని గురించి చెప్పుకొచ్చారు.
అయితే ఇలాంటి క్రమంలోనే కొందరు ఫాన్స్ గతంలో బాలకృష్ణ – నాగచైతన్య మధ్య జరిగిన వార్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . అప్పట్లో బాలయ్య మీద అంత కోపం ప్రదర్శించిన నాగచైతన్య ఇప్పుడు ఇంత సైలెంట్ గా మాట్లాడడానికి కారణం ఏంటా..? అంటూ ఆరాతీస్తున్నారు . అంతేకాదు నాగచైతన్య ఈవెంట్ కి రావడం వెనక పెద్ద రీజన్ ఏదో ఉండే ఉంటుందని.. లేకపోతే నాగ చైతన్య ఇంత బాగా స్పీచ్ రాసుకుని రారు అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైన స్టేజీ పై గుక్క తిప్పుకోకుండా మాట్లాడి నందమూరి అభిమానులను స్టన్ చేశారు నాగ చైతన్య..!!