సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తూ అభిమానులకు తీవ్ర శోక సంద్రాన్ని మిగులుస్తున్నారు . కాగా రీసెంట్గా ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మరణించిన విషాద ఛాయల నుంచి మరవకముందే ఇళయరాజా అన్నగారి కొడుకు మరణించిన విషయం తెలిసింద్దే. ఆ వార్త విన్న 24 గంటలు గడవకుండానే తమిళ్ కమెడియన్ మనోబాలు మృతి చెందారు . కాగా ఆయన మరణించిన కొన్ని రోజులు గడవకుండానే ప్రముఖ నటుడు శరత్ బాబు మరణించారు .
దీంతో సినిమా ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది . గత కొన్ని రోజులుగా అతని ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చి ఏఐజి హాస్పిటల్ లో చేర్చారు ఆయన కుటుంబ సభ్యులు . ఈ క్రమంలోనే 70 ఏళ్ల ఆయన ఏఐజి హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు . దీనిపై హాస్పిటల్ సిబ్బంది అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు .
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం తీవ్ర శోఖ సంద్రంలో మునిగిపోయింది. కాగా గత రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ..వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారని ..ఈ క్రమంలోని కొద్దిసేపటి క్రితమే ఆయన హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్లోని ఆముదాలవలస లో జన్మించారు.
సినిమాల పై ఉండే ఇంట్రెస్ట్ తో ఇటుగా వచ్చినా ఆయన ఆ తర్వాత తమిళ – తెలుగు – కన్నడ సినీ రంగాలలో 220 పైగా సినిమాలో నటించాడు. శరత్ బాబు కథానాయకుడుగానే కాకుండా ప్రతి నాయకుడిగా తండ్రి పాత్రలో వంటి విలక్షణ రోల్స్ లో కూడా మెప్పించాడు . అలాంటి ఓ నటుడు ఇండస్ట్రీలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమైన విషయం అనే చెప్పాలి . శరత్ బాబు మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు..!!