మెగా కోడలు పిల్ల ఉపాసన కడుపుతో ఉన్న విషయం తెలిసిందే.. ప్రెసెంట్ ఏడవ నెల రన్ అవుతుంది . ఈ క్రమంలోనే కొణిదెల ఫ్యామిలీ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది . కాగా ఇన్నాళ్లు ఫ్రెండ్స్ సమక్షంలో శ్రీమంతం జరుపుకున్న ఉపాసన ఇప్పుడు అఫీషియల్గా సాంప్రదాయ బద్దంగా కుటుంబ పెద్దల ముందు జరుపుకోబోతున్నత్లు తెలుస్తుంది. మే 15న మెగాకోడలు ఉపాసన శ్రీమంతం గ్రాండ్ అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరపబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది .
అంతేకాదు సీమంతానికి కావాల్సిన గోల్డ్ షాపింగ్ కూడా రీసెంట్ గానే జూబ్లీహిల్స్ లోని ఓ బంగారు దుకాణంలో ఉపాసన షాపింగ్ చేసిందట . అటు కామినేని ఫ్యామిలీ ఇటు కొణిదేల ఫ్యామిలీ ఇద్దరూ ఉపాసనకు కావాల్సిన నగలు సాంప్రదాయ బద్ధంగా పెట్టాల్సిన వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఉపాసన శ్రీమంతానికి మెగాస్టార్ చిరంజీవి రిటర్న్న్ గిఫ్ట్లుగా కనీ వినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేశారట .
ఓ పెద్ద బాక్స్ లో 60 – 70 రకాల స్వీట్లు.. రెండు వెండి దీపాలు.. పట్టు చీర.. గాజులు ..లక్ష్మీదేవి కాసు .. పలు రకాల పండులును ప్యాక్ చేసి మరి గ్రాండ్గా రిటర్న్ గిఫ్ట్లు ప్లాన్ చేశారట . దీనికోసం ఆయన కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కగాని ఒక్క కొడుకుకు లేక లేక పుడుతున్న బిడ్డకు ఈ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా అంటున్నారు జనాలు . ఏది ఏమైనా సరే ఉపాసన సీమంతం సినీ ఇండస్ట్రీలోనే రికార్డుగా చేయడానికి మెగా ఫ్యామిలీ రెడీ అవుతుంది అంటూ ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు . ఫాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!!