Moviesరాత్రికి రాత్రి ప్లాన్ ఛేంజ్.. చరణ్ లైఫ్ లో ఊహించని మలుపు..!?

రాత్రికి రాత్రి ప్లాన్ ఛేంజ్.. చరణ్ లైఫ్ లో ఊహించని మలుపు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అయితే చరణ్ తీసుకున్న బోల్డ్ డెసిషన్ కి షాక్ అయిపోతున్నారు . మనకు తెలిసిందే ప్రజెంట్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు . ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న చరణ్ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే అదే రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే ప్రజెంట్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ .. ఆ తర్వాత బుచ్చిబాబు సన డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు .

ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వికపూర్ రెండో హీరోయిన్ గా రష్మిక మందన సెలెక్ట్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే స్క్రిప్ట్ ప్రకారం ఈ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కావాల్సి ఉందట . అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో రామ్ చరణ్ ఈ సినిమా షూట్ ని లేటుగా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఉపాసన ని ప్రజెంట్ ఏడవ నెల రన్ అవుతుంది. మరో రెండు నెలల్లోనే పండు లాంటి పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతుంది .

ఈ క్రమంలోనే లైఫ్ లో ఎంతో స్పెషల్ మూమెంట్స్ ని రామ్ చరణ్ మిస్ చేయాలని అనుకోవట్లేదట. ఆ కారణంగానే ఏకంగా మూడు నెలల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట . ఎటువంటి షూట్ లేకుండా టోటల్ లైఫ్ ని తన బిడ్డకే అంకితం చేయాలని డిసైడ్ అయ్యారట . ఈ క్రమంలోనే బుచ్చిబాబు సనా సినిమా మళ్లీ హోల్డ్ లో పడింది . ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు సనా ఇన్నేళ్లు గ్యాప్ తీసుకోవడం ఓ మైనస్.. అయితే ఆయన కమిట్ అయిన సినిమాలు అన్ని లేటుగా సెట్స్ పైకి వెళ్తూ ఉండడం మరో నెగటివ్ అంటున్నారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ ఈ సినిమాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూట్ కంప్లీట్ చేయాలి అనుకున్నారట. అయితే రాత్రికి రాత్రి ప్లాన్ చేంజ్ చేస్తూ మార్చేస్తూ బుచ్చిబాబు సన జాతకాని మార్చేశాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో రాంచరణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చూడాలి మరి ఈ నిర్ణయంతో చరణ్ లైఫ్ ఎలా మలుపు తిరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news