Moviesమెగా ఇంట పెళ్లి భాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్..ఆ...

మెగా ఇంట పెళ్లి భాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్..ఆ స్పెషల్ డే నే నిశ్చితార్ధం..!?

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ..త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా అంటే అవునని అంటున్నారు సోషల్ మీడియా వర్గాలు . కాగా ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక డివర్స్ న్యూస్ సోషల్ మీడియాలో ఏ మేరా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీనిపై నిహారిక కూడా ఎక్కడా కూడా అఫీషియల్ గా స్పందించకపోవడంతో .. ఈ వార్తను నిజమే అంటూ నమ్మేస్తున్నారు మెగా ఫాన్స్ .

ఇలాంటి క్రమంలోనే నాగబాబు.. ఆ విడాకుల ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడానికి వరుణ్ తేజ్ కి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారట . ఆల్రెడీ అబ్బాయికి పెళ్లి ఈడు కూడా వచ్చేసింది. ఇంక ఎందుకు లేటు అంటూ ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకునేసారట. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఎంతో ఇష్టపడిన లావణ్య త్రిపాఠితోనే ఆమె పెళ్లి చేయబోతున్నారు కుటుంబ సభ్యులు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు నిశ్చితార్థం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. జూన్ 17వ తేదీ వీళ్ళ నిశ్చితారధం జరగబోతున్నట్లు ఓ న్యూస్ వైఅరల్ అవుతుంది . కాగా ఇప్పటివరకు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచడమే కాకుండా మెగా నిశ్చితార్ధానికి రెండు రోజుల ముందే ఈ సీక్రెట్ ను రివిల్ చేయాలని ఆలోచిస్తుందట. మెగా కాంపౌండ్ నుంచి ఇంట్లో పని చేసే పని వారి దగ్గర నుంచి ఈ వార్త సోషల్ మీడియాకు లీకై వైరల్ అవుతున్నట్లు తెలుస్తుంది . మొత్తానికి మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అంటూ కంగ్రాజులేషన్స్ విషెస్ చెబుతున్నారు అభిమానులు..!! చూద్దాం మరి దీని పై నాగ బాబు ఎలా స్పందిస్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news