టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొంతమంది మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న మరి కొంతమంది అభిమానిస్తూనే ఉన్నారు . మరీ ముఖ్యంగా మంచు మోహన్ బాబు మంచు విష్ణు కన్నా మంచు మనోజ్ అంటే జనాల్లో హ్యూజ్ పాపులారిటీ ఉంది . ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు ..ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడితే తాడోపేడో తేల్చుకుంటాడు అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి .
రీసెంట్ గానే భూమా నాగిరెడ్డి రెండవ కుమార్త భూమ మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ ..రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌లకు ఆయన టపాటపీ అంటూ సమాధానం ఇచ్చారు . ఈ క్రమంలోనే గతంలో ఓ స్టార్ హీరోయిన్ కి తనకి ఇష్టం లేకపోయినా సోషల్ మీడియా బలవంతంగా పెళ్లి చేసేసింది అంటూ బిగ్ బాంబు పేల్చారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు తాప్సి . తాప్సి మంచు మనోజ్ కలిసి నటించిన సినిమా “ఝుమ్మంది నాదం”. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా టాక్ అందుకుంది. అంతే కాదు ఇద్దరు కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది . ఈ క్రమంలోనే మంచు మనోజ్ – తాప్సీల మధ్య లవ్ ఎపహైర్ ఉంది అంటూ వార్తలు వచ్చేసేయ్ . అంతేనా కొంతమంది యూట్యూబ్‌లో ఫేక్ ధంబ్ నెయిల్స్ క్రియేట్ చేసి వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేసేసారు . ఇదే విషయం పై ఓపెన్ అప్ అవుతూ మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు . “నాకు ఇష్టం లేకపోయినా ఆ హీరోయిన్ తో బలవంతంగా పెళ్లి చేసేసింది సోషల్ మీడియా. అయినా ఈ వార్తలు విని నేను తాప్సి పక్కపక్క నవ్వుకున్నాం ” అంటూ మేటర్ ని కూల్ గా సాల్వ్ చేసేసాడు..!!