తెలుగు సినీ రంగంలో ఎవరూ పెద్దగా వివాదాల జోలికి పోలేదు. కానీ, తమిళ చిత్రసీమలో చాలా మంది జీవితాలు.. వివాదాల్లోనే తిరిగాయి. వివాదాలతోనే ముగిశాయి. సావిత్రి నుంచి జయమాలిని వరకు.. జయలలిత నుంచి రాధిక వరకు అనేక మంది వివాదాలతోనే జీవితాలు గడిపారు. వీరిలో జయమాలిని జీవితం మరింత చిత్రంగా సాగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తొలి తరం హీరోయిన్‌గా పదికిపైగా సినిమాలు చేసిన జయమాలిని.. అనే విషయాల్లో వివాదంతోనే ఉన్నారు.
జయమాలిని.. వ్యాంపుక్యారెక్టర్‌లు, ఐటం సాంగులకే పరిమితం అనుకునేవారు చాలా మంది ఉన్నారు.. కానీ, ఆమె జీవితాన్ని పరికిస్తే.. ఆమె తమిళ మాటల రచయితగా.. కూడా ఎదిగారు. మాజీ సీఎం కరుణాని ధికి అన్నీ చేసేవారనే టాక్ ఉంది. ఆయనకు కొన్నాళ్ల పాటు పీయేగా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో నే కరుణానిధితో ఆమె సహజీవనం చేశారనే టాక్ ఉంది. తర్వాత.. ఆయన సూచనల మేరకే.. ఒక వ్యక్తిని అదీ.. సినిమాలకు సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఇలా మొత్తంగా జయమాలిని జీవితంలో నలుగురిని పెళ్లి చేసుకుంది. వీరిలో ఒకరు దర్శకుడు అయితే.. మరొకరు డాన్సు మాస్టర్ అయితే.. వీరిలో ఇద్దరికి విడాకులు ఇచ్చిన జయమాలిని.. ఒకరిని వదిలించుకో లేక పోయింది. ఆయన జయమాలినిపై కోర్టుకు వెళ్లి.. ఆస్తులు కావాలని దావా వేయడం తో రాజీకుదుర్చు కుని.. మళ్లీ సంసారం చేయాల్సి వచ్చింది. అదే సమయంలో మూడో భర్త కూడా.. ఉండడంతో ఇద్దరితోనూ సంసారం చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. మూడో భర్త.. ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో నాలుగో భర్తతోనే ఎక్కువగా ఉంది. మొత్తంగా జయమాలిని జీవితాన్నిచూస్తే.. నలుగురిని పెళ్లి చేసుకుని ఇద్దరికి విడాకులు ఇచ్చి.. ఇద్దరితో సంసారం చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆదరణ లేకుండా ఉన్నారనే టాక్ ఉంది. కోలీవుడ్ ఇస్తున్న పింఛన్‌తోనే జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలా.. జయమాలిని జీవితం ఒక దశ దిశలేకుండా సాగిందని చెప్పుకొంటారు.