యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోలలో సల్మాన్ ఖాన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రభాస్ వయసు ఇప్పటికే నాలుగున్నర పదులకు చేరువ అవుతుంది. ప్రభాస్ కు తిరుగులేని పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. అయితే ఇప్పటికీ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ వరుస పెట్టి యాక్షన్ సినిమాలు.. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలకు చేస్తూ వస్తున్నాడు.
బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్ ఇప్పుడు రిలీజ్ గా ఉన్న ఆది పురుష్ – సలార్ – ప్రాజెక్టుకే – స్పిరిట్ ఇలా అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందు మిర్చి లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ఉన్న సినిమాలు కూడా చేశాడు. అయితే గత కొంతకాలంగా ప్రభాస్ ఫ్యామిలీ సినిమాలకు పూర్తిగా దూరమవుతున్న పరిస్థితి.
అయితే ఈసారి ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్న కోరికతో ప్రభాస్ ఉన్నాడట. ప్రభాస్ నుంచి ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలో వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇటీవల ఓ అగ్ర నిర్మాత ప్రభాస్‌ను కలిసినప్పుడు మాటల్లో ఈ కోరిక వ్యక్తం చేశాడట. మంచి ఫ్యామిలీ సబ్జెక్టు ఉంటే సినిమా చేద్దాం అని ఆ నిర్మాతకు హామీ ఇవ్వడంతో ఇప్పుడు సదరు నిర్మాత టాలీవుడ్లో అలాంటి కథల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ఫీల్ గుడ్ సినిమాలు చేయడంలో ఆ నిర్మాతకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ప్రభాస్ నుంచి అలాంటి ఆఫర్ వచ్చిందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభాస్ గతంలో డార్లింగ్, మిస్టర్ పెర్ ఫెక్ట్, మిర్చి సినిమాలు చేశాడు. ఇప్పుడు యాక్షన్, పాన్ ఇండియా కథలే చేస్తున్నాడు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌కు ఓకే చెప్పడం మనోడి ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు మాంచి జోష్ లాంటి వార్తే..!