టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని చాలా రొమాంటిక్ ఫెలోనా ..? అంటే అవునని అంటున్నారు ఆయన ఫ్రెండ్స్ సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే హీరో నాని బయటికి చాలా జోవియల్ గా కనిపిస్తూ ఉంటాడు . ఎలాంటి విషయానైనా సరే చాలా చాలా లైట్‌గా తీసుకుంటూ ఉంటారు . నిజానికి నానిలో ఆ క్వాలిటీని ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు . అంతేకాదు నాని చాలా రొమాంటిక్ ఫెలో అని చాలా తక్కువ మందికి తెలుసు . భార్యతో పెద్దగా బయట ఎక్కడా కనిపించని నాని తన పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో పెట్టకూడదు అని భావిస్తూ ఉంటారట .
ఈ క్రమంలోనే తన భార్య కు సంబంధించిన ఫొటోస్ ని ఎప్పుడు కూడా షేర్ చేయడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నాని తన వైఫ్ అంజనాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . కాగా పెళ్లికి ముందు వీళ్ళు తెగ ఎంజాయ్ చేసారట. ఇప్పటికీ హీరో నాని తన భార్యని ప్రేయసిగానే చూస్తున్నాడట . కార్ ఎక్కితే లవర్ గా.. ఇంట్లో ఉంటే భార్య గా ట్రీట్ చేస్తూ హీరో నాని ఆమెను ఓ మహారాణిలో చూసుకుంటున్నారట. రొమాంటిక్ డిన్నర్ డేట్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటాడట నాని ఇది తెలుసుకున్న జనాలు నాని లో ఇంత రొమాంటిక్ ఫెలో కూడా ఉన్నాడా అంటూ షాక్ అయిపోతున్నారు.
అంతేకాదు నాని సినిమాల విషయంలో అంజనా తీసుకున్న డిసిషన్సే ఫైనల్ గా సక్సెస్ అవుతున్నాయి అంటూ కూడా అప్పట్లో ఓ న్యూస్ వైరల్ అయింది . గతంలో నాని ఎన్నో ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ ఫ్లాప్ సినిమాలన్నీ చేయొద్దు అంటూ అంజనా నానికి చెప్పుకొచ్చిందట . అయినా సరే నాని వినలేదు . ఫైనల్లి దసరా, శ్యామ్ సింగర్ లాంటి హిట్ సినిమాలు నాని ఖాతాలో పడేలా చేసింది అంజనా అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు .