తెలుగులో తొలి తరం స్టార్ యంకర్లలో ఝాన్సీ ఒకరు. అచ్చ తెలుగు ఆడపడుచుగా.. తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా ఆమె చేసిన యాంకరింగ్ ఆమెకు ఎంతోమంది బుల్లితెర అభిమానులను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటుకుంది. సుమ – ఉదయభాను – ఝాన్సీ లాంటి యాంకర్ల మధ్య అప్పట్లో గట్టిపోటి ఉండేది. ఇక టాక్ ఆఫ్ ది టౌన్ షో ఝాన్సీకి మంచి పేరు తెచ్చింది. అలాగే బుల్లితెరపై పలుషోలకు ఆమె యాంకర్ గా వ్యవహరించారు
అదేవిధంగా వెండితెరపై నటిగాను సక్సెస్ అయ్యారు. ఝాన్సీ కెరీర్ పరంగా దూసుకుపోయినా.. వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఝాన్సీ నటుడు జోగినాయుడును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కూతురు పుట్టాక వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. అప్పుడప్పుడు వీరి మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. విడిపోయాక జోగినాయుడు తన సొంత మరదలిని పెళ్లి చేసుకున్నా.. ఝాన్సీ మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది.
ఇక ఝాన్సీ తన తాజా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేర్లు చెప్పకపోయినా కొందరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు నాకు అన్యాయం చేసిన వాళ్లకు నా శాపం తప్పకుండా తగులుతుంది.. నా ఉసురు తగిలి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఆమె వాపోయారు. ఒక పెద్ద డైరెక్టర్ రెండు రోజులు వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ చేయించుకున్నారు.. నాకు రావలసింది నాకు ఇచ్చేసినా. ఆ సినిమా నుంచి నన్ను తప్పించి ఆ పాత్రను మరో వ్యక్తితో చేయించుకున్నారు.. అది నాకు ఎంత అవమానం అని ఝాన్సీ వాపోయారు.
ఆ డైరెక్టర్‌కు తిరిగి కోలుకోలేనంత దెబ్బ తగిలింది. ఆ సినిమాలో దమ్ము లేదు.. అందుకే ఆడలేదని చెప్పింది. ఇక తాను ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని.. పోలీసుల రైడింగ్ లో పట్టు పడ్డానని.. పోలీసులు అరెస్టు చేశారని కూడా వార్తలు రాశారు. రైడింగ్ లో దొరికితే తాను ఇప్పుడు ఇక్కడ ఎందుకు ? ఉంటాను అలా ఎవరు రాయించారో ? నాకు తెలుసు.. ఎందుకురాయించారో తెలుసు.
దానికి వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు.. నాకు 8 నంది అవార్డులు వచ్చాయి అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పారు. ప్రస్తుతం వెబ్ మీడియా జర్నలిజం అంత కాపీ పేస్ట్ అని.. వాస్తవాలు తెలిసి రాయాల్సిన అవసరం వాళ్లకి లేదు అని ఝాన్సీ చెప్పింది. అయితే ఝాన్సీ రైడింగ్ లో పట్టుబడింది అంటూ వార్తలు రాయించిన వాళ్లు ఎవరు ? ఆ హీరో పేరుతో ఆమెకు ఎందుకు లింక్ పెట్టారు అన్నదానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.