Moviesపెళ్లి త‌ర్వాత కూడా ఆ హీరోను వ‌ద‌ల‌ని కాజ‌ల్‌… ఆమె అంటే...

పెళ్లి త‌ర్వాత కూడా ఆ హీరోను వ‌ద‌ల‌ని కాజ‌ల్‌… ఆమె అంటే పిచ్చ క్ర‌ష్ అట‌…

టాలీవుడ్ లో కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా సరైన హిట్ పడటం లేదు. తాజాగా అప్పుడెప్పుడో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛ‌త్రపతి హిందీ రీమేక్ లో నటించాడు. ఈ శుక్రవారం ఈ రీమేక్ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో సాయి శ్రీనివాస్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తనతో పాటు కవచం, సీత‌ లాంటి సినిమాల్లో కలిసి నటించిన కాజల్ అంటే తనకు పిచ్చ క్ర‌ష్ అని ఓపెన్ గానే చెప్పాడు.

కాజల్ తన ఫేవరెట్ హీరోయిన్ అని.. తాను టీనేజ్ యువకుడుగా ఉన్నప్పటి నుంచే కాజల్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని ఓపెన్ గానే చెప్పాడు. దీంతో అప్పట్లోనే రకరకాల గాసిప్పులు వచ్చాయి. అయితే కాజల్ మాత్రం ప్రతిసారి తనకు శ్రీనివాస్ మంచి స్నేహితుడు అంటూ చెప్పేది. పైగా వయసులో శ్రీనివాస్ కంటే కాజల్ చాలా పెద్దది. ఇక ఇద్దరి మధ్య ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. కాజల్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తోంది.

చిరంజీవితో సినిమా చేసిన తర్వాత కాజల్ ఇప్పుడు బాలయ్య సినిమాకి కమిట్ అయింది. పెళ్ల‌య్యాక ఆమె యంగ్ హీరోల పక్కన నటించేందుకు పెళ్లి తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. తాజాగా తన ఫ్రెండ్ అయిన‌ బెల్లంకొండ శ్రీనుతో కాజల్ ముంబైలో హడావుడి చేసింది. ముంబైలో బెల్లంకొండ నటించిన ఛ‌త్రపతి హిందీ ప్రీమియర్ షోలో కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి వచ్చి తనకంటే చిన్నవాడు అయినా బెల్లంకొండను ఆశీర్వదించింది.

అయితే వీరిద్దరి స్నేహాన్ని చూసినవారు వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఇంకా కొనసాగుతోందంటున్నారు. కాజల్ అంటే తనకు పిచ్చ క్ర‌ష్‌ అని చెప్పిన బెల్లంకొండ ఆమెతో ఆ స్నేహబంధాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా హిందీ మార్కెట్లోను బెల్లంకొండకు మంచి స్నేహ సంబంధాలు అయితే ఉన్నాయి. మరి ఆ స్నేహం ఆ మార్కెట్ రేంజ్ ను ఎలా ? పెంచుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news