చెన్నై చిన్నది సమంతకు యేడాదిన్నర క్రితం వరకు సోషల్ మీడియాలోనూ, ఇంటర్నెట్ సెర్చింగ్లోనూ తిరుగులేని పాపులారిటీ ఉండేది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతకు వరుసగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. చైతుతో విడాకులతో వైవాహిక బంధం తెగిపోయింది. తర్వాత సరైన హిట్ లేదు. ఎన్నో ఆశలతో వచ్చిన యశోద కమర్షియల్గా ప్లాప్.
గుణశేఖర్ శాకుంతలం కూడా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా సమంత పరువు తీసేసింది. విజయ్ దేవరకొండతో చేస్తోన్న ఖుషి సినిమాకు కూడా ఆశించినంత క్రేజ్ లేదు. అసలు సమంత విజయ్ పక్కన అక్కలా ఉందని విజయ్ ఫ్యాన్సే ట్రోల్ చేసేవరకు వచ్చింది. చివరకు ఆమె స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు ఛాన్సులు ఇవ్వకపోవడంతో ఆమె సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోల పక్కన కూడా ఓకే చెప్పేస్తోంది.
ఆమె వ్యక్తిగత కారణాలు, అనాలోచిత నిర్ణయాలే సమంత పట్ల ఉన్న క్రేజ్ తగ్గడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. మరో విచిత్రం ఏంటంటే ఇప్పటికే పెళ్లి చేసుకుని పిల్లను కనడంతో పాటు ఫేడవుట్ అయిపోయిన కాజల్ సమంతను మించిన క్రేజ్అందుకుంది. కాజల్ చేతిలో సమంతకు ఉన్న సినిమా ఛాన్సులు కూడా లేవు. పైగా అన్ని కాంట్రవర్సీలు కూడా ఆమెకు ఉండవు.
అయినా కాజల్ రీఎంట్రీతో వరుస సినిమాల్లో నటిస్తు బీజిగా ఉంది. పైగా కాజల్ సమంతలా రెచ్చిపోయి అందాలు ఆరబోయట్లేదు. అటు భర్తతో పద్ధతిగా సంసారం చేసుకుంటూనే ఇటు సినిమాల్లో చేస్తోంది. ఇప్పుడు ఆమెకు ఏకంగా బాలయ్య పక్కన ఛాన్స్ వచ్చింది. ఆమె చేతిలో ఇండియన్ 2 సినిమా ఉండనే ఉంది. కాంట్రవర్సీ చేస్తేనో… వచ్చిన సినిమా అల్లా ఒప్పుకుంటేనో… మొత్తం విప్పి చూపించేస్తేనో క్రేజ్ రాదు… పద్ధతిగా ఉన్నా.. పెళ్లయి.. పిల్లలు ఉన్నా క్రేజ్, ఛాన్సులు వస్తూనే ఉంటాయి అనేందుకు కాజలే పెద్ద సాక్ష్యం.